ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు :  కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్​యాదయ్యతో కలిసి ఇంటర్​పరీక్షలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 25 ఎగ్జామ్​సెంటర్లను ఏర్పాటు చేశామని, 6,216 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 6,437 మంది రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు.

ఆయా సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు సకాలంలో బస్సులు నడపాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్లు ఏర్పాటు చేసి, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎగ్జామ్​సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. డీఐఈవో అంజయ్య, డీఎంహెచ్​వో సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓటరు జాబితా మ్యాపింగ్ స్పీడప్​ చేయాలి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) 2002 జాబితాతో 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్ ను స్పీడప్​చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ కలెక్టర్  ఖీమ్యా నాయక్, ఆర్డీవో సుబ్రమణ్యం పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో మ్యాపింగ్​ప్రక్రియ 65.94 శాతం పూర్తయిందని తెలిపారు. వనపర్తి మండలంలో నెమ్మదిగా సాగుతోందని, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 

ఇంటర్​ ఎగ్జామ్స్​ పక్కాగా నిర్వహించాలి

గద్వాల, వెలుగు: ఇంటర్​ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ నెల 25 నుంచి మార్చి 16 వరకు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని 14 సెంటర్లలో ఫస్టియర్ స్టూడెంట్స్ 4,366 మంది, సెకండియర్ స్టూడెంట్స్ 4,105 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించి, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏఎస్పీ శంకర్, డీఐఈవో ఉదయరాజు తదితరులు పాల్గొన్నారు.