సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు నీలాద్రి ఆదాయం రూ.8.44 లక్షలు

సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు నీలాద్రి ఆదాయం రూ.8.44 లక్షలు

సత్తుపల్లి, వెలుగు : మహాశివరాత్రి సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపో నుంచి నీలాద్రి టెంపుల్ కు 26 బస్సులు నడపగా, రూ.8,44,428 ఆదాయం వచ్చినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 15 నుంచి 16 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడిపించామన్నారు. గతేడాదితో పోలిస్తే రూ.26 వేలు ఆదాయం అదనంగా వచ్చిందని తెలిపారు.

మొత్తం 23,422 మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించగా, వారిలో 14,127 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. ఈసారి 500 మంది ప్రయాణికులు అదనంగా ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించినట్లు వివరించారు. ఆర్టీసీ బస్సులను ఆదరించిన ప్రయాణికులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ మేనేజర్ పి.ప్రవీణ్ కుమార్, మెకానికల్ ఇంజినీర్ ఎస్.సాహితి పాల్గొన్నారు.