దమ్మపేట, వెలుగు: అశ్వారావుపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ కు సూచించారు. నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్ పర్సన్ జూపల్లి రమేశ్ మంగళవారం దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట మున్సిపాలిటీకి నిధుల విషయంలో ఢోకా లేదన్నారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నాయకులు తాడేపల్లి రవి, విజయ్ కుమార్ రెడ్డి, దోపకుంట్ల దుర్గారావు, మొగళ్లపు లక్ష్మీనారాయణ, పెనుమచ్చ సత్యనారాయణరాజు తదితరులు ఉన్నారు.
