ఇంటర్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

ఇంటర్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఇంటర్​ఎగ్జామ్స్​పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో వివిధశాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్​ఎగ్జామ్స్​జరగనున్నట్లు తెలిపారు. జిల్లాలో 37 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నాపత్రాలను పోలీస్​స్టేషన్ల నుంచి ఎగ్జామ్ సెంటర్ల వద్దకు తీసుకెళ్లే టైంలో భద్రతా నియామాలు పాటించాలన్నారు.

స్టూడెంట్స్ ప్రశాంతంగా పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎగ్జామ్స్​ జరిగే రోజుల్లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. నిరంతరంగా కరెంట్ సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎగ్జామ్ సెంటర్లలో హెల్త్​క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్​శాఖాధికారి వెంకటేశ్వర రావు, జడ్పీ సీఈవో బి.నాగలక్ష్మితోపాటు అధికారులు పాల్గొన్నారు. 

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం..

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకమని కలెక్టర్ జితేశ్​వి పాటిల్అన్నారు. పాల్వంచలోని డాక్టర్​మన్మోహన్ సింగ్ ఎర్త్​సైన్సెస్ యూనివర్శిటీలో రెండో విడత సర్పంచులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివిధ స్కీంల కింద వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు.