మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: శిక్ష సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవాలని, ఉద్యోగంలో పేదల సంక్షేమానికి కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్న 60 మంది గ్రూప్–1 ట్రైనీ ఆఫీసర్లు రెండు రోజుల ఫీల్డ్‌విజిట్‌లో భాగంగా మంగళవారం మహబూబ్ నగర్ చేరుకున్నారు. కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ట్రైనీ ఆఫీసర్లు గండీడ్, నవాబ్ పేట్, చిన్న చింతకుంట, అడ్డాకల్, కౌకుంట్ల మండలాల్లోని కొన్ని గ్రామాలను సందర్శించి, అక్కడి ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకుంటారని ఆమె చెప్పారు.
