తాగునీటికి ఇబ్బందులు రావొద్దు : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

తాగునీటికి ఇబ్బందులు రావొద్దు : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

మణుగూరు, వెలుగు : రాబోయే ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. మంగళవారం మణుగూరు పట్టణంలోని ప్రజాభవన్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వేసవికాలంలో తాగునీటి సమస్య ఉండొద్దన్నారు.

సమగ్ర నీటి సరఫరా ప్రణాళిక, పైప్‌‌లైన్ల ద్వారా గాగునీరు అందించడంతోపాటు అవసరమైతే వాటర్ ట్యాంకర్లు, హ్యాండ్‌‌ పంపుల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని చెప్పారు. సాంకేతిక సమస్యలను తక్షణ పరిష్కరించాలని, పైప్‌‌లైన్ లీకేజీలు, మోటార్ల లోపాలు, ఓవర్ హెడ్ ట్యాంకుల మరమ్మతులు చేపట్టాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు నిరంతరం తాగునీటి సరఫరా చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్​బ్ల్యూఎస్, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ అధికారులతోపాటు తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.