బీహార్ ఎలక్షన్స్.. 2027 జనరల్ ఎలక్షన్స్ కు ముందున్న అగ్ని పరీక్ష. ఈ ప్రీఫైనల్ లో పాసైతే..ఫైనల్ ఈజీ అవుతుందని సర్వశక్తులూ ఒడ్డింది కాంగ్రెస్-జేడీయూ కూటమి మహాగట్బంధన్. ఓట్ చోరీ లాంటి సంచలనాత్మక ఆరోపణలు చేయడమే కాకుండా వాటికి సంబంధించిన రజువులు చూపిస్తూ.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బ్రాడర్ వేలో చేసిన ప్రచారం ప్రజల్లోకి చేరినట్లే అనిపించినా.. ఫలితాల్లో కనిపించలేదు.
2025 నవంబర్ 14 న వచ్చిన బీహార్ అసెంబ్లీ ఫలితాల్లో మహాగట్బంధన్ కూటమి కేవలం 35 సీట్ల లోపే పరిమితమవ్వడం ఆ కూటమి పార్టీలను విస్మయానికి గురిచేసింది. భారీ అంచనాల నడుమ ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తుందనుకున్నా.. ఓట్ల రూపంలో ట్రాన్స్ ఫర్ చేసుకోవడంలో విఫలమైంది. అయితే రాహుల్, తేజస్వీ యాదవ్ ఆధ్వర్యంలో ముందుకెళ్లిన మహాగట్బంధన్ ఓటమికి కారణాలేంటో ఒక సారి చర్చించాల్సిన అవసరం ఉంది.
ఓటమికి 5 కారణాలు:
యుద్ధానికి ఆలస్యంగా వచ్చిన సేనాని:
మహాగట్బంధన్ కూటమికి సీఎం అభ్యర్థిగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్.. బరిలోకి ఆలస్యంగా రావడం ఒక ఫ్యాక్టర్ అంటున్నారు. హామీలు ఇచ్చినప్పటికీ అమలుకు సాధ్యమవుతాయా అనే స్పష్టత లేకపోవడం మైనస్ అనే వాదన ఉంది. తమ కుటుంబానికి కంచుకోట అయిన రాఘోపూర్ లో కూడా తేజస్వీ అతి కష్టం మీద గెలవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దీనికి తోడు ఎన్డీఏ అడ్వాన్స్డ్ స్ట్రాటజీతో ఆరోపణ అయినా.. విమర్శ అయినా.. హామీ అయినా ముందుగానే ఇచ్చే ప్రయాక్టివ్ స్ట్రాటజీతో ముందుకెళ్లింది. కానీ మహగట్బంధన్ రియాక్టివ్ స్ట్రాటజీకే పరిమితమైందని అంటున్నారు. ముందుగా టార్గెట్ చేయకపోవడం.. ఎన్డీఏ చేసిన ట్రాప్ లో పడటమే కాకుండా.. వాళ్లకు కౌంటర్ ఇవ్వడం వరకే పరిమితమైంది కానీ.. గోల్ ముందే సెట్ చేసే పరిస్థితి లేకుండా పోయిందని విశ్లేషకుల అభిప్రాయం.
సీట్ షేరింగ్ ఆలస్యం అవ్వటంతో.. సీఎం క్యాండేట్ గా ఆలస్యంగా రింగ్ లోకి దిగటం. దీనికి తోడు అంతర్గతంగా సమస్యల కారణంగా యూనిటీగా.. పూర్తిస్థాయిలో క్యాంపెయిన్ నిర్వహించలేకపోవడం. కొత్త ఎజెండా క్రియేట్ చేయడంలో తేజస్వీ సక్సెస్ కాలేకపోయారని అంటున్నారు.
అంతర్గత కుమ్ములాటలు:
సీట్ల పంపకాల విషయంలో ఉన్న అసంతృప్తి దెబ్బతీసినట్లు తెలుస్తోంది. దీంతో ఇంటర్నల్ గా సొంత కూటమి నేతలకు వ్యతిరేకంగా పావులు కదపడం. దీంతో ఓటర్లు కన్ఫ్యూజన్ లో పడిపోయే పరిస్థితి. డిప్యూటీ సీఎం విషయంలో నేనంటే నేనంటూ.. చివరికి వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ పట్టుమీద ఉండటం. సీఎం అభ్యర్థి అంశంలో కూడా చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం. సీట్ల పంపకంలో టికెట్ రాని నేతలు వ్యతిరేకంగా పనిచేయడం. ఈ విషయంలో ఎన్డీఏ సక్సెస్ అయినట్లు చెబుతున్నారు.
►ALSO READ | నితీష్ కేబినెట్లోని.. 29 మంది మంత్రుల్లో 27 మంది గెలిచారు.. ట్విస్ట్ ఏంటంటే..
ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధారపడటం:
ఈ ఎన్నికల్లో నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిసి వస్తుందనే ఆలోచనలో ఉండటం మైనస్ అయ్యింది. ఎందుకంటే వ్యతిరేకతను డీల్ చేయడంలో జేడీయూ, ఎన్డీఏ, సక్సెస్ అయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేకతను చల్లబర్చేందుకు ఓటర్ సెగ్మెంట్ ను బేస్ చేసుకుని సెటిల్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా మహిళలు, యూత్ నే టార్గెట్ చేసి బైటపడ్డారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన లాంటి పథకాలు ఎన్నికల ముందు తెచ్చి సక్సెస్ అయ్యారు.
లాలూ ప్రసాద్ యాదవ్ జంగిల్ రాజ్ మరక:
1990-2005 మధ్యలో లాలూ ప్రసాద్ యాదవ్ పాలన మరకలు ఇంకా ఆర్జేడీని వదలలేదు. ఆర్జేడీ వస్తే మళ్లీ అరాచక పాలన వస్తుందని, గూండా యిజం, రౌడీయిజం, కిడ్నాప్, కుల ఆధారిత హింసలు.. ఇలా రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందనే ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లటంతో ఎన్డీఏ సక్సెస్ అయ్యింది.
ఎన్డీఏ వ్యతిరేక ఓటు ఎక్కడ..?
మహాగట్బంధన్ మునిగిపోవటానికి కారణం VIP (వికాస్ శీల్ ఇన్ సాన్ పార్టీ), కాంగ్రెస్ పార్టీనే అంటూ ఇప్పటికే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ రెండు పార్టీలు పర్ఫామెన్స్ సరిగా లేకపోవడంతో కూటమి ఓట్ షేర్ ను సాధించలేకపోయిందని అంటున్నారు. డిప్యూటీ సీఎం నేనే అని చెప్పుకున్న VIP పార్టీ సారధి.. ఒక్కసీటు కూడా సాధించలేకపోయారు. అదే క్రమంలో కాంగ్రెస్ కూడా ఎన్డీఏ వ్యతిరేక ఓట్లను తమ కూటమికి ట్రాన్స్ ఫర్ చేయలేకపోయిందని అంటున్నారు.
