ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌ ఆర్డర్ దక్కితే .. ఇండియాలోనే కేసీ390 తయారీ

ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌ ఆర్డర్ దక్కితే ..  ఇండియాలోనే కేసీ390 తయారీ
  •     ఆసియా పసిఫిక్ దేశాలకు ఇక్కడ నుంచి  సప్లయ్: ఎంబ్రాయర్‌‌‌‌‌‌‌‌ సీఈఓ

న్యూఢిల్లీ: ఇండియా ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ నుంచి 80 ట్రాన్స్‌‌‌‌పోర్ట్ విమానాల కాంట్రాక్ట్ పొందితే , కేసీ-390 మిల్లీనియం విమానాల తయారీని ఇండియాలో చేపడతామని, ఆసియా పసిఫిక్ రీజియన్‌‌‌‌కు హబ్‌‌‌‌గా మారుస్తామని బ్రెజిల్‌‌‌‌ కంపెనీ ఎంబ్రాయర్ ప్రకటించింది.  కంపెనీ సీఈఓ  ఫ్రాన్సిస్కో గోమ్స్ నేతో మాట్లాడుతూ,  కేసీ390ను చాలా నాటో దేశాలు వాడుతున్నాయని అన్నారు. ఇవి కొత్త తరం మల్టీ -మిషన్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్,  ఏరియల్ రీఫ్యూయెలింగ్ విమానమని అన్నారు. 

‘‘లాక్‌‌‌‌హీడ్‌‌‌‌కి చెందిన సీ-130జే కంటే 25–30శాతం వేగంగా, 26 టన్నుల లోడ్ సామర్థ్యంతో, తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో  కేసీ 390 పనిచేస్తుంది”అని ఆయన వివరించారు. ఇండియన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ సోవియట్ కాలం నాటి  ఏఎన్‌‌‌‌-32, ఐఎల్‌‌‌‌-76 పాత విమానాలను మార్చడానికి 80 మిలిటరీ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌ (ఎంటీఏ) లను   కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కేసీ-390తో పాటు ఎయిర్‌‌‌‌‌‌‌‌బస్‌‌‌‌ ఏ400ఎం, లాక్‌‌‌‌హీడ్‌‌‌‌ సీ130జే కూడా పోటీలో ఉన్నాయి. మహీంద్రాతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఈ ఎంటీఏ ప్రోగ్రామ్‌‌‌‌లో  ఎంబ్రాయర్  పాల్గొంటోంది. అదానీ డిఫెన్స్‌‌‌‌తో  కలిసి ఈ–175 జెట్‌లను తయారు చేయాలని చూస్తోంది.