నేపాల్ లో నదిలో పడ్డ బస్సు..18 మంది మృతి

నేపాల్ లో నదిలో పడ్డ బస్సు..18 మంది మృతి

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధాడింగ్ జిల్లాలోని బెనిఘాట్ రోరాంగ్ గ్రామీణ  సమీపంలో   బస్సు  త్రిశూలి నదిలో పడిపోయింది.  ఈ  ప్రమాదంలో18 మంది మృతి చెందగా మరో 10 మందికి పైగా  గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది

ఫిబ్రవరి 23న  తెల్లవారుజామున బస్సు  పోఖారా నుంచి  ఖాట్మండుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  వాహనం దాదాపు 300 మీటర్ల వాలుపై పడిపోయింది .  ఘటనా స్థలానికి వచ్చి రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.  గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  మృతుల్లో  ఆరుగురు మహిళలు, 12 మంది పురుషులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు గుర్తించారు. మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.