న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చు తగ్గుల్లో కదిలే అవకాశం ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌లను అమెరికా సుప్రీం కోర్టు కొట్టేయగా, దీనికి ప్రతీకారంగా ఆయన అదనంగా 15 శాతం గ్లోబల్ టారిఫ్ వేశారు. ఫిబ్రవరి 25న ట్రంప్ స్పీచ్ షెడ్యూల్ ఉంది. ఈ అంశాలు గ్లోబల్ మార్కెట్లలో వోలటాలిటీ పెంచనున్నాయి. ఇండియాలో ఈ నెల 24న ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ డే ఉంది.
దీంతో మార్కెట్‌లో వోలటాలిటీ కనిపించొచ్చు. ఇండియా జీడీపీ డేటా , ఫారెక్స్ రిజర్వ్ డేటా ఫిబ్రవరి 27న, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవుట్‌పుట్ డేటా 28న వెలువడనున్నాయి. ఇవి మార్కెట్ దిశను ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయంగా అమెరికా–ఇరాన్ సంబంధాలు, క్రూడ్ ఆయిల్ ధరల మార్పులు, డాలర్‌తో రూపాయి కదలికలు, గ్లోబల్ పాలసీ మానిటరీ సంకేతాలపై ట్రేడర్లు దృష్టి పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. గత వారం సెన్సెక్స్ 187 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు పెరిగాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, పవర్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్ బలంగా ఉండగా, ఐటీ స్టాక్స్ పడుతున్నాయి.
