ధర్మేంద్ర ICU వీడియో లీక్.. కుటుంబ ప్రైవసీ ఉల్లంఘనపై ఆగ్రహం.. హాస్పిటల్ సిబ్బంది అరెస్ట్!

ధర్మేంద్ర ICU వీడియో లీక్.. కుటుంబ ప్రైవసీ ఉల్లంఘనపై ఆగ్రహం.. హాస్పిటల్ సిబ్బంది అరెస్ట్!

బాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ నటుడు ధర్మేంద్ర (89) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చేశారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేసింది.  ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.  అయితే, ధర్మేంద్ర ఆసుపత్రిలో ఉన్న సమయంలో దేవోల్ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిగత వీడియో లీక్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆసుపత్రి సిబ్బందిలో ఒకరు ఈ ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి లీక్ చేయడంతో..  సదరు వ్యక్తిని లేటెస్ట్ గా అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ICUలో రహస్యంగా చిత్రీకరణ

ఆసుపత్రి ICU లోపల రికార్డ్ చేయబడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్లిప్‌లో ధర్మేంద్ర ఆసుపత్రి బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. ఆయన చుట్టూ కుమారులు సన్నీ దేవోల్, బాబీ దేవోల్ భావోద్వేగంతో ఉన్నారు. మనవళ్లు కరణ్ దేవోల్, రాజ్‌వీర్ దేవోల్ కూడా ఈ వీడియోలో కనిపించారు. అంతేకాకుండా, ఆయన మొదటి భార్య ప్రకాష్ కౌర్ ఆయన పక్కనే కూర్చొని ఉన్నారు. ఒక కుటుంబం యొక్క అత్యంత వ్యక్తిగత, సున్నితమైన క్షణాలను రహస్యంగా చిత్రీకరించి, సోషల్ మీడియాలో లీక్ చేయడంపై అభిమానుల నుంచే కాక, సినీ పరిశ్రమలోని ప్రముఖుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రముఖులు ఈ చర్యను కుటుంబ గోప్యతను ఉల్లంఘించడమేనంటూ ఖండించారు.

హాస్పిటల్ సిబ్బంది అరెస్ట్

ఈ వీడియోను రహస్యంగా చిత్రీకరించి, లీక్ చేసిన ఆసుపత్రి ఉద్యోగిని అధికారులు గుర్తించి, అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి, గోప్యతా చర్యలను కఠినతరం చేయడానికి ఆసుపత్రి యాజమాన్యం అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. రోగుల ప్రైవసీని ఉల్లంఘించినందుకు ఆసుపత్రి ఉద్యోగిపై చర్యలు తీసుకోవడంతో ఇతరులకు కఠినమైన హెచ్చరిక పంపినట్లయిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 గోప్యతను గౌరవించండి.. 

 ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా దేవోల్ కుటుంబం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. మిస్టర్ ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఇంటి వద్ద రికవరీని అవుతున్నారు.  దయచేసి మీడియా, ప్రజలు ఇకపై ఎలాంటి ఊహాగానాలు చేయకుండా, ఈ సమయంలో కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరారు.  ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని మీరు చూపిస్తున్న ప్రేమకు, ప్రార్థనలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దయచేసి ఆయనకు మీ ప్రేమను, గౌరవాన్ని ఇవ్వండి అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు పంపుతున్నారు. ఆయన త్వరలో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆగస్త్య నందాతో కలిసి నటించే 'ఇక్కీస్' చిత్రంలో కనిపించనున్నారని అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.