పిల్లలు పూలతోటలోని పులా మొగ్గల్లాంటి వాళ్లు. వాళ్లను ప్రేమగా, జాగ్రత్తగా పెంచాలి. వాళ్లే దేశ భవిష్యత్తు. వాళ్లే భావి భారత పౌరులు'. జవహర్లాల్ నెహ్రూ పిల్లలను ఉద్దేశించి చెప్పిన మాట ఇది. ఇవాళ ఆయన జయంతి. ఇవాళే దేశమంతా ఆయన పేరు మీద 'బాలల దినోత్సవం' జరుపుకుంటోంది. ఈ పిల్లల పండుగ రోజు మీ పిల్లలకు మీరేం నేర్పిస్తున్నారు?
చిన్నప్పుడు నేర్చుకునే విషయాలు పిల్లల జీవితాల్లో బలంగా నాటుకుపోతాయి. ముఖ్యంగా కొన్ని మంచి అలవాట్లను పిల్లలుగా ఉన్నప్పుడే అలవర్చుకుంటే పెద్దయ్యాక కూడా ఫాలో అవుతుంటారు. అవి వాళ్లకు ఒక ప్రత్యేకతను. గౌరవాన్ని తీసుకొస్తాయి. అందుకే పిల్లలకు ఇవి నేర్పించండి.
ఆరుబయట ఆటలు ఆడించండి. పిల్లలు ఏడిస్తేనో, గోల చేస్తేనో వెంటనే ఫోన్ చేతికిచ్చేయడమో, టీవీ పెట్టి కార్టూన్ చూడమని చెప్పడమో చేస్తున్నారిప్పుడు చాలామంది. ఇలాంటి వాటికి పిల్లలు వెంటనే ఆకర్షితులవుతారు. అందులో మునిగిపోతారు కూడా! ఆ తర్వాత వాళ్లకు కేవలం ఈ ఆటల్లోనే ఆనందం. దొరుకుతుంది. కానీ పిల్లల్ని బయటకెళ్లి ఆడుకు నేలా చేయాలి. ఇంటి బయటికెళ్తే ఏముంటుంది, వీధి చివర ఏముంటుంది అనేది తెలుసుకోవాలి. ఆరు బయట ఆటలు ఆడమని చెప్పాలి. ఇది వాళ్లకు శారీరక బలాన్ని చేకూర్చడంతో పాటు, వాళ్ల మనసు, ఆలోచనలు ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఇంట్లోనే ఉండిపోతే మానసికంగా ఒంటరితనాన్ని చిన్నప్పట్నుంచే వాళ్లకు అలవాటు చేసినవాళ్లవుతారు.
పుస్తకం చేతికివ్వండి!
ఇవ్వాల్టి రోజుల్లో స్కూలికి వెళుతున్న పిల్లలందరూ ఇంతింత పెద్ద బ్యాగులు భుజాన వేసుకొని 'దేవుడా' అనుకుంటున్నారు. ఇదే వాళ్ల చదువై, ఇవే వాళ్ల పుస్తకాలు అయిపోతే కష్టం. మంచి కథల పుస్తకాలు పిల్లలకు అందించండి. బాలలకు మాత్రమే ప్రత్యేకంగా రాసిన కొన్ని వందల పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి...
చందమామ, పంచతంత్ర కథలు, బాలల జానపద కథలు.. ఇలాంటివి లెక్కలేన్ని ఉన్నాయి. ఇంగ్లీష్ కూడా హారీ పాటర్ తరహా పుస్తకాలు పిల్లల కోసం చాలా ఉన్నాయి. అలాంటివి పిల్లలకు కొనిచ్చి చదవడం ప్రోత్సహించండి. టీవీలో వచ్చే షోస్ చూపించడం కంటే పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. కథల్లోని పాత్రలను, వర్ణనలను మొదళ్లలోకి ఎక్కించుకొని కొత్త ప్రపంచాన్ని పిల్లలు తమకు తామే ఆవిస్కరించుకుంటారు. ఇది ఆ తర్వాత కాలంలో వాళ్ల జీవితాల్ని దిద్దుకోవడంలో, ఉన్నతంగా ఆలోచించడంలో పనికొస్తుంది. మంచి పుస్తకం.. మీ పిల్లలు బాల్యాన్ని అందంగా దిద్దుకోవడానికి మీరిచ్చే ఒక మంచి బహుమతి అవుతుంది.
