కరీంనగర్ లో గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. శుక్రవారం ( నవంబర్ 14 ) గుంటూరుపల్లి-బొమ్మకల్ దగ్గర తనిఖీలు నిర్వహించిన కరీంనగర్ రూరల్ పోలీసులు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 260 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి యమహా బైక్, నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
నిందితులు దుర్శేడ్‌కు చెందిన చరణ్, గోపాల్‌పూర్‌కు చెందిన లోకేష్, మరో మైనర్ బాలుడు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. పరిచయస్తులైన ముగ్గురు కలిసి విక్రయం చేస్తున్నట్టు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
►ALSO READ | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్..
ఇదిలా ఉండగా.. బుధవారం ( నవంబర్ 12 ) గంజాయి రవాణా కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు నల్గొండ పోలీసులు.. ఈ నెల 10న కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 బైక్‌లపై వస్తున్న ఏడుగురు వ్యక్తులు వారిని చూసి పారిపోవడానికి యత్నించారు. ఇద్దరు పారిపోగా మిగితావారు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.
