ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్.. 200MP కెమెరాతో ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్.. ఇండియాలో లాంచ్..?

ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్.. 200MP కెమెరాతో ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్.. ఇండియాలో లాంచ్..?

ఒప్పో కంపెనీ నుంచి కొత్తగా ఒప్పో ఫైండ్ X9 సిరీస్ ఫోన్లు త్వరలోనే ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. అయితే వీటి అఫీషియల్ లాంచ్ తేదీ నవంబర్ 18 కాగా.. ఈ కొత్త ఫోన్ల గురించి కంపెనీ కొన్ని ఫీచర్స్ టీజ్  చేసింది. ప్రత్యేకంగా ఒప్పో ఫైండ్ X9 ప్రోలో 13.2x లాస్‌లెస్ జూమ్, 120x హైబ్రిడ్ జూమ్‌తో 200-మెగాపిక్సెల్ కెమెరా  ఉంటుందని తెలిపింది. దీనితో పాటు ఫోన్‌లో రెండు 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లు కూడా ఉంటాయి.  

ఒప్పో ఫైండ్ X9, ఒప్పో ఫైండ్ X9 ప్రో  కెమెరా:
ఒప్పో ఫైండ్ X9 ప్రో 200-మెగాపిక్సెల్, 13.2x లాస్‌లెస్ జూమ్‌తో వస్తుందని, ఇతర కెమెరా ఫీచర్స్ లో 48-జోన్ లైట్ అనాలిసిస్, జీరో-గోస్టింగ్ HDR, LUMO ఇమేజ్ ఇంజిన్ ప్రాసెసర్ ఉన్నాయి. ఒప్పో ఫైండ్ X9 ప్రో మూడు బ్యాక్ కెమెరాలలో ఫుల్  50-మెగాపిక్సెల్ రిజల్యూషన్ ఫోటోలు తీయగల  ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ చెబుతోంది. ఇతర కెమెరా ఫీచర్స్ లో యాక్టివ్ ఆప్టికల్ అలైన్‌మెంట్, రియల్-టైమ్ ట్రిపుల్ ఎక్స్‌పోజర్ HDR టెక్నాలజీ, 4K 120fps డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ ఉన్నాయి.

ఒప్పో ఫైండ్ X9 & ఒప్పో ఫైండ్ X9 ప్రో రెండూ 1/1.95-అంగుళాల సోనీ LYT-600 సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో ఉంటుంది. ఇది 10cm కనీస ఫోకస్ దూరంతో 3x ఆప్టికల్ జూమ్, 6x లాస్‌లెస్ జూమ్‌  అందిస్తుంది. రెండు మోడళ్లలో f/2.0 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ JN5 (1/2.75-అంగుళాల) అల్ట్రా-వైడ్ కెమెరా (1/2.75-అంగుళాల) కూడా ఉంటుంది. కెమెరా 120° ఫీల్డ్ ఆఫ్ వ్యూ అందిస్తుంది అలాగే ఆటోఫోకస్ సపోర్ట్‌తో వస్తుంది. ఒప్పో ఫైండ్ X9, ఒప్పో ఫైండ్ X9 ప్రో లేటెస్ట్ వేపర్-ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, AI DEnoise, AI Demosaic, HyperTone, Lightning Snap వంటి LUMO-ఎనేబుల్డ్ ఫీచర్లతో వస్తాయని ఒప్పో చెబుతుంది. 

ఒప్పో ఫైండ్ X9, ఒప్పో ఫైండ్ X9 ప్రో స్పెసిఫికేషన్లు:
Oppo Find X9 Pro సింగిల్ ఆప్షన్ 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. క్లీన్ లుక్ కోసం సిల్క్ వైట్, రగ్డ్ అప్పీల్ కోసం టైటానియం చార్‌కోల్ ఇచ్చారు. ప్పో ఫైండ్ X9 విషయానికి వస్తే, ఈ ఫోన్ 12GB RAM + 256GB & 16GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. ఇది టైటానియం గ్రే & స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, Oppo Find X9, Find X9 Pro రెండూ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌పై పనిచేస్తాయి, 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్, Arm G1 అల్ట్రా గ్రాఫిక్స్ ప్రాసెసర్‌తో కాన్ఫిగరేషన్‌లను అందిస్తున్నాయి.  బేస్ మోడల్ Find X9 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా లెన్స్‌తో ఉంటుంది, అయితే ప్రో ఎడిషన్ 200 మెగాపిక్సెల్ టెలిఫోటో మాడ్యూల్‌కు అప్‌గ్రేడ్ అవుతుందని భావిస్తున్నారు. ఒప్పో ఫైండ్ X9  7,050mAh బ్యాటరీతో, ప్రో వెర్షన్ 7,500mAh బ్యాటరీ కెపాసిటీతో ఉంటుంది.