వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‎లో 3 రోజులు ఈ రూట్లు బంద్..!

వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‎లో 3 రోజులు ఈ రూట్లు బంద్..!

హైదరాబాద్: వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. 2025 జూన్ 30 నుంచి  2025 జూలై 2 వరకు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం మహోత్సవ వేడుకలు జరగనున్నాయని.. ఈ మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. కల్యాణోత్సవం (జూలై 1), రథోత్సవం (జూలై 2) కారణంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం దగ్గర భారీ ట్రాఫిక్ ఉంటుందన్న అంచనాల మేరకు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు తెలిపారు. 

ట్రాఫిక్ మళ్లింపులు:

  • గ్రీన్‌ల్యాండ్స్/సత్యం థియేటర్ ఫతేనగర్: SR నగర్ టీ జంక్షన్ వద్ద మళ్లించబడింది
  • ఫతేనగర్ ఫ్లైఓవర్ బల్కంపేటకు: న్యూ బ్రిడ్జి వద్ద కాటమైసమ్మ ఆలయం-బేగంపేటకు మళ్లించబడింది
  • గ్రీన్‌ల్యాండ్స్-ఫుడ్ వరల్డ్ బల్కంపేటకు: ఫుడ్ వరల్డ్ X రోడ్డు వద్ద సత్యం థియేటర్/SR నగర్‌కు మళ్లించబడింది
  • బేగంపేట నుండి బాల్కంపేటకు: గ్రీన్‌ల్యాండ్స్-సత్యం థియేటర్-SR నగర్ T Jnకు మళ్లించబడింది
  • SRనగర్ T Jn నుండి ఫతేనగర్‌కు బై-లేన్‌లు మూసివేయబడ్డాయి.
  • పార్కింగ్: R&B కార్యాలయం, GHMC మైదానం, పద్మశ్రీ-నేచర్ క్యూర్, ఫతేనగర్ అండర్ బ్రిడ్జి, నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్డు పక్కన.