నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన శివస్వాములు దేవస్థానం ఏర్పాట్లు దర్శన విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యూలైన్లలో ఆందోళనకు దిగారు. క్యూలైన్లలో కిక్కిరిసిపోయిన శివస్వాములు ఆలయ ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. దీక్ష తీసుకున్న భక్తులు భారీగా భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకొనేందుకు వచ్చారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదని..శివ స్వామి దీక్షాపరుల అవస్థలు, దేవస్థానం అధికారులు పట్టించుకోలేదని శివస్వాములు ఆందోళనకు దిగారు.
స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉన్నప్పటికీ స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించకపోవడంతోపాటు కనీసం అల్పాహారం, మంచి నీరు కూడా అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైన్లలో కిక్కిరిసిపోయిన శివస్వాములు సహనం కోల్పోయి ఆలయ ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Also Read : దేవుడి భక్తికి 9 మార్గాలు.. నిత్య జీవితంలో పాటించాల్సినవి కూడా ఇవే..!
స్వామి దర్శనం ఆలస్యం కావడంతో శివస్వాములలో ఆగ్రహం కట్టలు తెంచుకంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచివున్న శివ స్వాములు,కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి క్యూ లైన్లలో వేచిఉండలేక గేట్లు ధ్వంసం చేశారు. శివనామస్మరణలతో మారుమోగాల్సిన శ్రీశైలంలో ఈవో డౌన్ - డౌన్ నినాదాలు వినిపిస్తున్నాయి.
