Valentine’s Day Special: థియేటర్లలో రొమాన్స్ జాతర – రిలీజ్‌కు సిద్ధమైన క్రేజీ మూవీస్

Valentine’s Day Special: థియేటర్లలో రొమాన్స్ జాతర – రిలీజ్‌కు సిద్ధమైన క్రేజీ మూవీస్

వాలంటైన్స్ డే స్పెషల్‌గా 2026 ఫిబ్రవరి 14న థియేటర్లలో వరుసగా అదిరిపోయే సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఫ్యామిలీ, రొమాంటిక్, యాక్షన్, క్రైమ్, స్పోర్ట్స్ వంటి విభిన్న జోనర్లలో ప్రేక్షకులను అలరించే చిత్రాలు ఈసారి రానున్నాయి. ముఖ్యంగా ఈ వాలంటైన్స్ సీజన్‌లో యూత్‌ను ఆకట్టుకునే లవ్ రొమాంటిక్ సినిమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అదే సమయంలో మిగతా జోనర్లలో కూడా ఆసక్తికరమైన కథాంశాలతో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవేంటో ఇప్పుడు ఓసారి చూద్దాం.. 

కపుల్ ఫ్రెండ్లీ:

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. వాలంటైన్స్ డే సందర్భంగా ఈనెల 14న సినిమా విడుదల కానుంది. జీవితంలో స్ట్రగుల్స్, లవ్, ఎమోషన్స్, రొమాన్స్ వంటి అంశాలతో యూత్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కింది.

ఇదొక జెన్యూన్ ఇంటెన్షన్తో, హానెస్ట్గా చేసిన సినిమా అని తెలుస్తోంది. ఇందులో సంతోష్ శోభన్ తన సహజమైన నటనతో ఆకట్టుకోగా, మానస వారణాసి వెండితెరకు కొత్త గ్లామర్‌ తీసుకొచ్చింది.స్ట్రగుల్స్, లవ్, ఎమోషన్స్, రొమాన్స్, డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి.  

ఫంకీ:

మాస్ కా దాస్ విశ్వక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేన్ హీరోగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫంకీ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తోంది. అనుదీప్ కేవీ మార్క్ కామెడీ, వన్ లైనర్లతో ట్రైలర్, టీజర్ ఎంటర్టైనింగ్స్ గా ఉన్నాయి. ఈ ట్రైలర్, టీజర్ విజువల్స్ లో ఉన్నంత ఫన్ సినిమాలో ఉంటే Gen-Zs థియేటర్లకు గట్టిగానే వెళ్లే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా Funky సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

సీతా పయనం:

యాక్షన్ కింగ్ అర్జున్ నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ను వెండితెరకు పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. కుటుంబ అనుబంధాలకు, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ అర్జున్ తెరకెక్కించారు. 

ఈ సినిమాపై ప్రస్తుతం భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కాబోతోంది.

అమరావతికి ఆహ్వానం:

శివ కంఠంనేని, ధ‌‌న్య బాల‌‌కృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హ‌‌రీష్  ప్రధాన పాత్రల్లో జీవీకే దర్శకత్వంలో  కెఎస్ శంక‌‌ర్‌‌రావు, ఆర్ వెంక‌‌టేశ్వర‌‌రావు  నిర్మించిన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. ఫిబ్రవరి 13న సినిమా విడుదల కానుంది. హారర్ థ్రిల్లర్ జానర్ లో ఇది తెరకెక్కింది. 

చతా పచ్చ.. ది రింగ్ ఆఫ్ రౌడీస్:

మలయాళంలో తెరకెక్కించిన యాక్షన్‌ సినిమా చతా పచ్చ.. ది రింగ్ ఆఫ్ రౌడీస్. రెజ్లింగ్‌ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందిన పాన్‌ ఇండియా సినిమా ఇది. జనవరి 22న మలయాళ థియేటర్లో సందడి చేసింది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విశాక్ నాయర్, ఇషాన్ షౌకత్ కీలక పాత్రల్లో నటించారు. అద్వైత్‌ నాయర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కోసం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.