
కోల్‌కతా: బెంగాల్ రాజధాని కోల్‌కతాలో లా స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మోనోజిత్ మిశ్రాపై మరో యువతి సంచలన ఆరోపణలు చేసింది. మోనోజిత్ మిశ్రా తనను కూడా బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. రెండేళ్ల క్రితం ఓ పని మీద కాలేజ్‌కు వెళ్తే బెదిరించి తనపై దాడి చేసి లైంగికంగా వేధించాడని తెలిపింది.
ఈ విషయం బయటకు చెబితే నా తల్లిదండ్రులు, సోదరిని చంపేస్తానని బెదిరించడంతో ఇన్నాళ్లు ఎవరికీ విషయం చెప్పలేదని బాధితురాలు తెలిపింది. పోలీసులను సంప్రదించడానికి తనకు భయం వేస్తోందని వాపోయింది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కళాశాల బోర్డు అధ్యక్షుడు అశోక్ కుమార్ దేబ్ అతనికి అండగా ఉన్నాడని.. మిశ్రాకు ఉన్న రాజకీయ సంబంధాల వల్లే ఈ ఘటనపై తాను అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పింది.
ALSO READ | బ్రేకప్ చెప్పిందని.. తండ్రి ముందే గర్ల్ ఫ్రెండ్ గొంతు కోసి చంపిన యువకుడు..
మిశ్రాపై గతంలో అనేక పోలీసు ఫిర్యాదులు నమోదైనప్పటికీ అతని రాజకీయ ప్రభావం వల్ల పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపించింది. తనే కాకుండా దాదాపు 15 మంది విద్యార్థినులు మోనోజిత్ మిశ్రా చేతిలో బలైపోయారని యువతి సంచలన ఆరోపణలు చేసింది. మోనోజిత్ మిశ్రా బ్యాచ్‌మేట్స్ కూడా అతనిపై ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. అతడు ఎప్పుడు ఇతరులను ఇబ్బందులకు గురరి చేసేవాడని తెలిపారు. కళాశాల క్యాంపస్‌లో యువతులను వేధించేవాడని ఆరోపించారు.
లా స్టూడెంట్ గ్యాంగ్‌రేప్ కేస్:
2025 జూన్ 28న సౌత్ కలకత్తా లా కాలేజీకి చెందిన ఒక మహిళా విద్యార్థినిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై మోనోజిత్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మిశ్రా గతంలో తనకు పెళ్లి ప్రపోజ్ చేస్తే.. తాను తిరస్కరించానని.. దీంతో ఇద్దరు విద్యార్థులు చూస్తుండగానే తనపై అత్యాచారం చేశాడని బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.