
మేఘాలయాలో ఘోరం జరిగింది... గర్ల్ ఫ్రెండ్ ను తన తండ్రి ముందే గొంతు కోసి చంపాడు యువకుడు. సోమవారం ( జూన్ 30 ) మేఘాలయాలో తూర్పు పశ్చిమ ఖాసి హిల్స్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... సోమవారం సాయంత్రం యువతి తన తండ్రితో కలిసి మైరాంగ్ పిండెన్‌గుమియోంగ్ గ్రామంలోని ఒక మార్కెట్‌కు తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడం కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.మృతురాలిని మావ్‌ఖాప్ గ్రామానికి చెందిన ఫిర్నైలిన్ ఖర్సింటివ్‌గా గుర్తించారు పోలీసులు.
ALSO READ | 13 ఏళ్ల బాలిక కిడ్నాప్..హైడ్రామా : సిటీ అంతా జల్లెడ పట్టిన పోలీసులకు షాక్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు తన తండ్రితో కలిసి మార్కెట్ లో ఉండగా.. అక్కడికి వచ్చిన నిందితుడు ఆమెతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఒక్కసారిగా నిందితుడు ఆమె గొంతు కోసి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు. నిందితుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. వ్యక్తిగత సమస్యలే హత్యకు గల కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. తన కూతురు బ్రేకప్ చెప్పినందుకు నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని.. హత్య చేసే సమయంలో నిందితుడు తన కోపాన్ని వెళ్ళగక్కాడని తెలిపాడు మృతురాలి తండ్రి. సమాజంలో రోజురోజుకు దిగజారిపోతున్న మానవ సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోంది ఈ ఘటన.