
OTT వెబ్ సిరీస్ ప్రభావమో.. సోషల్ మీడియా ప్రభావమో.. ఏదైతే ఏం కానీ.. ఓ 13 ఏళ్ల బాలిక చేసిన పని.. పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. పేరంట్స్ కు నరకం చూపించింది. బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు.. ఇంట్లో ఓ లేఖ కనిపించింది. మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నాం.. మీ అమ్మాయిని మీకు సురక్షితంగా కావాలంటే 15 లక్షల రూపాయలను మేం చెప్పినట్లు ఇవ్వండి.. పోలీసులకు సమాచారం ఇస్తే మీ అమ్మాయిని చంపేస్తాం అని లేఖ రాశారు.. పేరంట్స్ భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు..పోలీసులు అప్పటికిప్పుడు ప్రత్యేక టీమ్స్..150 మంది పోలీసులు.. ఏడు టీమ్స్ గా ఏర్పడి సిటీ మొత్తం జల్లెడ పట్టారు.. చివరకు ఏమైందీ..ఆ అమ్మాయి సుక్షితంగా ఇంటికి చేరిందా లేదా.. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ కు చెందిన 13యేళ్ల బాలిక..అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది..కూతురి గదిలో ఓ లెటర్ కనిపించడంతో బెంబేలెత్తిపోయారు.మీ కుమార్తెను మేం కిడ్నాప్ చేశాం.ఆమె మీకు సురక్షితంగా కావాలంటే రూ 15లక్షలు మేం చెప్పిన చోటికి తీసుకురావాలంటూ లెటర్ రాసింది. పోలీసులకు చెబితే మీ పాప ప్రాణాలు తీస్తాం అని కూడా లేఖలో ఉంది. జబల్ పూర్ జిల్లాలోని ఖమారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో ఈ సంఘటన జరిగింది.
ఆ మేసేజ్ చూసిన పేరెంట్స్ భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి మైనర్ కావడంతో పోలీసులు జబల్ పూర్, భోపాల్‌లో బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. ఆ అమ్మాయి తన సొంత కిడ్నాప్‌కు పాల్పడిందని తేలింది.
అందరూ ఆశ్చర్యపోయేలా ఆ అమ్మాయి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఒప్పుకుంది. ఇంట్లో తిడుతున్నారు. తిట్లనుంచి తప్పించుకునేందుకు తానే ఈ మొత్తం ఎపిసోడ్‌ను నిర్వహించానని చావు కబురు చల్లగా చెప్పింది. మొబైల్ ఫోన్ వాడటం, స్నేహితులతో మాట్లాడటం ,లిప్‌స్టిక్ రాసుకోవడం వంటివి చేస్తుండటంతో తన తల్లి తరుచుగా తిడుతుందని చెప్పడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక నెల పాటు గది అద్దెకు సరిపోయేంత డబ్బుకోసం ఆమె తన పిగ్గీ బ్యాంకును కూడా పగలగొట్టింది. అక్కడ ఆమె ఎవరి ప్రమేయం లేకుండా స్వతంత్రంగా జీవించాలని ప్రణాళిక వేసుకుంది.
ఇలాంటి సంఘటనలు కొత్తేమి కాదు.. గతంలో మహారాష్టకు చెందిన 19యేళ్ల యువకుడు కూడా ఫేక్ కిడ్నాప్ డ్రామా ఆడి చివరికి పోలీసులకు దొరికిపోయాడు.మార్చిలో జరిగిన మరో ప్రత్యేక సంఘటనలో, మహారాష్ట్రలోని వాసాయిలో నకిలీ కిడ్నాప్ డ్రామా ఆడి అతని కుటుంబం నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేసినందుకు 19 ఏళ్ల యువకుడిని ,అతని ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు పోలీసులు.