
గేమ్ చేంజర్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన సినిమా. భారీ బడ్జెట్ తో, అంతకు మించి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అటు ఫ్యాన్స్ ని, ఇటు మూవీ లవర్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సినిమా డిజాస్టర్ అవుతుందని రిలీజ్ కి ముందే అర్థమైందని నిర్మాత దిల్ రాజు కూడా పలు సందర్భాల్లో ఓపెన్ గా చెప్పేశారు కూడా. గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వడం, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం జరిగిపోయి సుమారు ఆరు నెలలు గడిచిపోయింది. ఇప్పుడెందుకు గేమ్ చేంజర్ పై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది అంటే.. నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ సినిమా విషయంలో హీరో రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీయడమే ఇందుకు కారణం.
ALSO READ | Ramayana: రణబీర్-సాయిపల్లవి ‘రామాయణం’ రెడీ.. టీజర్ లాంచ్ అప్డేట్!
గేమ్ చేంజర్ సినిమాతో తమ పని అయిపోయింది అనుకున్నామని.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రాకపోతే తాము కోలుకొని ఉండేవాళ్ళం కాదని అన్నారు శిరీష్. గేమ్ చేంజర్ డిజాస్టర్ అయిన తర్వాత హీరో రామ్ చరణ్ కానీ.. డైరెక్టర్ శంకర్ కానీ.. తమకు ఫోన్ కూడా చేయలేదని అన్నారు శిరీష్. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తీవ్రంగా హర్ట్ అయ్యారు మెగా ఫ్యాన్స్. దిల్ రాజు శిరీష్ లపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. రామ్ చరణ్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు రామ్ చరణ్ ఫ్యాన్స్. గేమ్ చేంజర్ సినిమా వల్ల తమ హీరో ప్రైమ్ టైంలో మూడేళ్లు వేస్ట్ అయ్యాయని.. ఒక సంవత్సరం అని చెప్పి డేట్స్ తీసుకొని మూడేళ్లు వేస్ట్ చేశారని మండిపడుతున్నారు ఫ్యాన్స్.
RRR లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎంతోమంది నిర్మాతలు క్యూ కట్టినా కూడా మీకే ఛాన్స్ ఇచ్చినందుకు కనీసం కృతజ్ఞత కూడా లేకుండా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది గమనిక కాదు.. చివరి హెచ్చరిక అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఫ్యాన్స్. మిగతా హీరోల సినిమాలు ప్లాప్ అయినప్పుడు ఆ నిర్మాతలు హీరోల గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు ఫ్యాన్స్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయితే హీరో వెంకటేష్ కి అదనపు రెమ్యూనరేషన్ ఏమైనా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు ఫ్యాన్స్.
ప్రతి ప్రెస్ మీట్ లో, ఇంటర్వ్యూలో పదేపదే దీని గురించే చర్చిస్తూ తమను బాధకు, కోపానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంకోసారి గేమ్ చేంజర్ గురించి కానీ, రామ్ చరణ్ గురించి కానీ.. తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మెగా ఫ్యాన్స్. మరి, చిలికి చిలికి గాలి వానగా మారుతున్న గేమ్ చేంజర్ వివాదానికి ఎప్పుడు, ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాలి.