Ramayana: రణబీర్-సాయిప‌ల్ల‌వి ‘రామాయణం’ రెడీ.. టీజర్ లాంచ్ అప్డేట్!

Ramayana: రణబీర్-సాయిప‌ల్ల‌వి ‘రామాయణం’ రెడీ.. టీజర్ లాంచ్ అప్డేట్!

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటించిన బాలీవుడ్ మూవీ ‘రామాయణం’(Ramayana).డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణం పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ చేసుకుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే, ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. రామాయణం పార్ట్ 1 నుండి బిగ్ అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రామాయ‌ణం లోగో లాంచ్ వేడుకను బెంగళూర్‌లో ఘనంగా జరుపనున్నట్లు సమాచారం.

►ALSO READ | Thammudu Trailer: తమ్ముడు రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. నితిన్కు సక్సెస్ దక్కే ఛాన్స్ ఎక్కువే!

ఈ క్రమంలోనే టైటిల్ టీజ‌ర్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా గురువారం (జులై 3న) భారీ ఈవెంట్‌ను ఏర్పాటుచేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలే కనుక నిజమైతే.. రామాయణ ప్రాజెక్ట్ విజువ‌ల్ గ్రాండియారిటీపై మ‌రింత స్ప‌ష్ఠ‌త వ‌చ్చే అవకాశం ఉంది. 

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న VFXస్టూడియో DNEG విజువల్స్ కోసం పనిచేస్తుంది. టీజర్ పోర్షన్ కటింగ్ ఇప్పటికే రెడీ అయినట్లు సినీ వర్గాల టాక్. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్, పౌరాణిక సినీ విశ్వంలో ఒక అద్భుత విజువల్ వండర్ గా ఉండబోతుందని సమాచారం. 

ఈ పౌరాణిక గాథలో, రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, లారా దత్త కైకేయిగా నటించారు. ఈ మూవీ 2026 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళికి విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.