Thammudu Trailer: తమ్ముడు రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. నితిన్కు సక్సెస్ దక్కే ఛాన్స్ ఎక్కువే!

Thammudu Trailer: తమ్ముడు రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. నితిన్కు సక్సెస్ దక్కే ఛాన్స్ ఎక్కువే!

హీరో నితిన్ నటించిన తమ్ముడు రీ రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. శుక్రవారం జులై 4న థియేటర్లలో తమ్ముడు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నేడు మంగళవారం (జులై 01న) తమ్ముడు నుంచి మరో కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

అక్కకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే తమ్ముడి పాత్రలో నితిన్ నటించాడు. ' నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది. నాకు అమ్మయినా, నాన్న ఐనా.. అన్నీ మా అక్కే..' అని నితిన్ అనగా.. 'నీవెప్పటికీ అబద్దం.. ఎప్పటికీ తమ్ముడు అనిపించుకోలేవు..' అని చెప్పే డైలాగ్ ఎమోషనల్ కలిగిస్తోంది.

నీకు ఏ కష్టం వచ్చిన నీ ముందుంటా.. అని నితిన్ చెప్పడంతో.. 'తన ఎదురుచూపులో ఎంత ఇంటెన్స్ ఉందనేది చూపించారు. ఇలా వరుస డైలాగ్స్తో తమ్ముడు ట్రైలర్ ఆసక్తిగా సాగింది. ఫ్యామిలీ ఎమోషన్స్కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీసిన మూవీలా తమ్ముడు కనిపిస్తోంది.

తన ఊరు అంబరగొడుగులో జరిగే ఘటనలు సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నాయి. ఏదో లక్ష్యం కోసం తమ ప్రాణాలను కాపాడుకునే జనం, అవసరం కోసం వెంటాడే మనుషులు, ఈ క్రమంలో హీరో తన అక్క ప్రేమ కోసం తాపత్రయం, ఎలాగైనా ఆమె నోటితో తనను తమ్ముడు అని పిలిపించుకోవాలన్న ఆశ ఇలా ప్రతిఒక్క అంశం సినిమాపై అంచనాలు పెంచుతోంది. నువ్వు ఇంకెంత దూరం వెళ్లిన నిన్ను తమ్ముడిగా ఒప్పుకోదు.. తాను ఒప్పుకున్నా.. నేను ఒప్పుకోను అని నితిన్ చెప్పే డైలాగ్ సినిమాకు ట్విస్ట్ ఇస్తోంది. 

నితిన్ సినిమాలు:

నితిన్ విషయానికి వస్తే.. వరుస సినిమాల ఫెయిల్యూర్స్ తో సతమతం అవుతున్నాడు. ఇటీవలే మాచెర్ల నియోజకవర్గం, ఎక్సట్రా, రాబిన్ హుడ్ మూవీస్ తో ఘోరపరాజయాలను చవిచూశాడు. ఇపుడీ వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ పై నమ్మకం పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్స్ అద్భుతంగా ఉన్నాయి. సిస్టర్ సెంటి మెంట్ కు ఊరి కష్టాలను చూపిస్తుడటం చూస్తే హిట్ అయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా కూడా నితిన్ కు సక్సెస్ ఇవ్వకపోతే.. ఆపై ఆశలన్నీ బలగం వేణు వైపే!