ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుకుందాం : ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న 

ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుకుందాం : ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న 

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : దేశంలో ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ విద్యార్థి బాధ్యత అని ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న అన్నారు.  భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ మంగళవారం పాలమూరు యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా గోరంటి వెంకన్న హాజరై ప్రసంగించారు.

విద్యారంగంలో ఎదురయ్యే సవాళ్లపై ప్రతీ విద్యార్థి పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యమంతో కూడిన చదువే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ విద్యాసంస్థలను విస్మరించి ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.