ఏ క్షణాన్నైనా యుద్దం జరగొచ్చు..ఇరాన్ నుంచి వెనక్కి వచ్చేయండి.. ప్రజలకు పోలాండ్ ప్రధాని పిలుపు

ఏ క్షణాన్నైనా యుద్దం జరగొచ్చు..ఇరాన్ నుంచి వెనక్కి వచ్చేయండి.. ప్రజలకు పోలాండ్ ప్రధాని పిలుపు

అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్నర ఉద్రిక్తతల నడుమ పోలాండ్  ప్రధాని ఆదేశ ప్రజలకు కీలక ఆదేశాలు చేశారు.  ఇరాన్ లో ఉంటున్న పోలిష్ పౌరులు వెంటనే పోలాండ్ కు రావాలని సూచించారు. పోలాండ్ నుంచి ఇరాన్ వెళ్లాలని ఎవరైనా షెడ్యూల్ చేసుకుంటే వెంటనే రద్దు చేసుకోవాలన్నారు.

ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా యుద్ద నౌకలు, ఫైటర్ జెట్లు మోహరించడంతో ఏ క్షణాన్నైనా యుద్దం జరగొచ్చు అని ప్రచారం జరుగుతున్న క్రమంలో..పోలాండ్ ప్రధాని డొనాల్డ్ ట్రస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లో ఉన్న పోలాండ్  ప్రజలు వెంటనే తిరిగి స్వదేశానికి రావాలి.. ఇరాన్ కు వెళ్లాలనుకునేవారు ఖచ్చితంగా  ప్రయాణాన్ని రద్దు  చేసుకోవాలని చెప్పారు.   

ఇరాన్  సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొంది.. మరో 24 గంటల్లో రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకునే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రస్క్ విలేకరుల సమావేశంలో చెప్పారు. అయితే పోలిష్ ప్రభుత్వ తమ ప్రజలను ఇరాన్ విడిచి రావాలని  చెప్పడం ఇది రెండో సారి.