యూట్యూబర్ అన్వేష్ Instagram అకౌంట్ బ్యాన్

యూట్యూబర్ అన్వేష్ Instagram అకౌంట్ బ్యాన్

హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‎కు బిగ్ షాక్ తగిలింది. అన్వేష్ ఇన్స్‎స్టా‎గ్రామ్ అకౌంట్‎ను ఆ కంపెనీ మాతృ సంస్థ మెటా బ్యాన్ చేసింది. యూట్యూబర్ అన్వేష్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. హిందూ దేవుళ్లలను దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అతనిపై సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. 

కళ్యాణి ఫిర్యాదుతో అన్వేష్పై 352,79,299 BNS SEC 67IT ACT కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అన్వేష్ ఇన్స్‎స్టా‎గ్రామ్ ఐడీ వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మెటాకు లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల ద్వారా మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడనే ఆరోపణలతో అతడి ఖాతాను బ్యాన్ చేయాలని పోలీసులు కోరారు.

పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన మెటా అన్వేష్ ఇన్స్‎స్టా‎గ్రామ్‎పై బ్యాన్ విధించింది. ఇన్స్ స్టాలో అన్వేష్‎కు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవారు. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో అతడిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాటు ఫాలోవర్స్ 1.3 మిలియన్స్‎కు తగ్గారు. 

నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్‎తో ప్రపంచ యాత్రికుడిగా పాపులారిటీ సంపాదించుకున్న అన్వేష్ విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారంగా వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు.. అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు.. గతంలో కూడా పలు అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు అన్వేష్.

ఇప్పుడు హిందూ దేవతలు, అమ్మాయిల వస్త్రధారణ వంటి సున్నిత అంశాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సీన్లోకి పోలీసులు ఎంటరయ్యారు. అన్వేష్ పై హిందూ సంఘాలు రగిలిపోతున్నాయి.. అన్వేష్‏ను దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు. అన్వేష్‎ను ఇండియాకు రప్పించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు.