T20 World Cup: T20 ప్రపంచ కప్ 2026 గ్రూప్– Bలో భాగంగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో సికందర్ రజా సేన గ్రాంఢ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక (62) ఒక్కడే హాఫ్ సెంచరీ చేయగా.. చివర్లో జట్టు భారీ స్కోర్ సాధించడంలో పవన్ రత్నాయకే (44) కీలక ఇన్సింగ్ ఆడాడు. కుశాల్ పెరీరా (22) ఫర్వాలేదనిపించిన మిగతా బ్యాటర్లు అందరు దారుణంగా విఫలమయ్యారు.
శ్రీలంక జట్టులోని మిగతా బ్యాటర్లు కుశాల్ మెండిస్ (14) కమిందు మెండిస్ (7), కెప్టెన్ దాసున్ షనకా (6), దుషన్ హేమంత (0) క్రీజులోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చివరి ఓవర్ లో దునిత్ వెల్లలాగే రెండు ఫోర్లు కొట్టడంతో శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగలిగింది. దీంతో జింబాబ్వే బౌలర్లలో గ్రేమ్ క్రీమర్, బ్లెస్సింగ్ ముజారబానీ, బ్రాడ్ ఎవాన్స్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, ర్యాన్ బర్ల్ ఒక వికెట్ తీసుకున్నాడు. లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు ప్రారంభం నుంచే లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. జింబాబ్వే ఓపెనర్లు తాడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్ దుకుడుగా బ్యాటింగ్ చేయడంతో టార్గెట్ తగ్గిపోయింది. 69 పరుగుల వద్ద తడివానాషే మరుమాని (34) మొదటి వికెట్ గా డగౌట్ కి వెళ్లిన తర్వాత మైదానంలోకి వచ్చిన ర్యాన్ బర్ల్ సైతం 12 బంతుల్లో 23 పరుగులు చేసి 98 పరుగుల దగ్గర ఔట్ అయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన సికందర్ రాజా కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడాడు. జస్ట్ 26 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సులతో 45 పరుగులు చేసి దుషన్ హేమంత బౌలింగ్ లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో దాసున్ షనకాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వా బ్యాటింగ్ కి వచ్చిన తషింగా ముసేకివా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చిన టోనీ మున్యోంగా కలిసి జట్టును గెలిపించాడు.
The Skipper is leading from the front! 👊
— Star Sports (@StarSportsIndia) February 19, 2026
Sikandar Raza and Brian Bennett are taking the game away from Sri Lanka. 🫡
Will Zimbabwe hold their nerve to finish as Group B Table Toppers? 🔝
ICC Men’s #T20WorldCup | #SLvZIM | LIVE NOW ➡️ https://t.co/HwjfgPhPO8 pic.twitter.com/ehAL001gBr
