' ప్రేమమ్' మూవీలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల మనసు దోచుకున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, డేటింగ్ లు వార్తలు సర్వసాదారణం. అయితే, అనుపమ , కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొంత కాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఒక వేడుకలో వీరిద్దరూ జంటగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. అక్కడ వీరిద్దరు దిగిన ఒక సెల్ఫీ ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ 'రూమర్డ్ కపుల్' ఫోటోలే ట్రెండింగ్‌లో ఉన్నాయి.
హార్ట్ ఎమోజీతో హింట్ ఇచ్చారా?
ఈ వేడుకలో ధృవ్ విక్రమ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అనుపమతో దిగిన ఒక క్యూట్ సెల్ఫీని పోస్ట్ చేశారు. దీన్ని చూసిన అభిమానులు ఖుషీ అవుతుండగానే, అనుపమ ఆ ఫోటోను తన స్టోరీలో రీ-షేర్ చేస్తూ ఒక 'హార్ట్ ఎమోజీ'ని జత చేసింది. ఇంకేముంది, అభిమానులు వీరిద్దరూ తమ ప్రేమను అధికారికంగానే చెప్పేస్తున్నారని కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు. "కోలీవుడ్‌లో అత్యంత క్యూట్ పెయిర్ ఇదే" అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
అర్థరాత్రి కాల్ ఎవరికి చేస్తారు?
వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో చెన్నైలో జరిగిన 'జేఎఫ్‌డబ్ల్యూ' (JFW) అవార్డ్స్ ఫంక్షన్‌లోనూ వీరిద్దరూ హాట్ టాపిక్‌గా నిలిచారు. ఆ వేడుకలో స్టేజ్ పైనే అనుపమకు ధృవ్ బర్త్ డే విషెస్ చెప్పగా, ఆమె సిగ్గుతో మురిసిపోయింది. అదే ఈవెంట్‌లో "అర్థరాత్రి 2 గంటలకు మీకు ఏ సమస్య వచ్చినా ఇండస్ట్రీలో ఎవరికి ఫోన్ చేస్తారు?" అని హోస్ట్ అడగగా.. ఏమాత్రం తడుముకోకుండా "ధృవ్‌కు చేస్తాను" అని సమాధానం ఇచ్చింది అనుపమ. ఆనాటి నుంచే వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందనే అనుమానాలు మొదలయ్యాయి.
Dhruv and anupama something something 🤭🫣 pic.twitter.com/vFvE5hM7qm
— 𝓓𝓸𝓵𝓵𝔂 🤍 (@dollybiblio) February 18, 2026
'బైసన్' సెట్స్‌లో చిగురించిన స్నేహం?
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బైసన్: కాలమాడన్' చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని సమాచారం. 'డ్రాగన్', 'బైసన్' వంటి చిత్రాలతో కోలీవుడ్‌లో సత్తా చాటింది. అనుపమకు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాయి. అటు ధృవ్ కూడా తన కెరీర్‌పై దృష్టి పెట్టారు. డేటింగ్ పుకార్లపై ఇప్పటివరకు వీరిద్దరు నేరుగా స్పందించలేదు. ప్రస్తుతం మాత్రం ఈ 'బైసన్' జంట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. మరి జంట తమ బంధాన్ని ఎప్పుడు అఫీషియల్ చేస్తారో చూడాలి.
