
ఎప్పుడైనా బేబీ ఆయిల్ ఉపయోగించాలని అనిపించిందా..? చర్మం,జుట్టు సంరక్షణ కోసం కొంతమంది పెద్దలలో బేబీ ఆయిల్స్ బాగా ఉపయోగపడ్డాయట. చర్మంపై పాక్షికంగా గాలి పీల్చుకునే పొరను ఏర్పరుస్తాయంటున్నారు. బేబీ ఆయిల్స్ మీ చర్మం ఉపరితలంపై సహజ తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయంటున్నారు స్కిన్ స్పెషలిస్టులు.
కొన్ని చిట్కాలు సింపుల్గా ఉన్నా అద్భుతంగా పనిచేస్తుంటాయి. అయితే టైంకి అవి గుర్తుకు రావు అంతే. పిల్లలు ఉన్న దాదాపు ప్రతి ఇంట్లో బేబీ ఆయిల్ ఉంటుంది. అయితే ఆ ఆయిల్ ను కేవలం బేబీస్ కు మాత్రమే వాడతాం. పెద్ద వాళ్లలా పిల్లల చర్మం రఫ్ గా ఉండదు. చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అందుకే వెదర్ మారినప్పుడు స్కిన్ పగలడం, రాషెస్ రావడం చిన్నపిల్లల్లో తొందరగా కనిపిస్తుంది.
దుకే కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవాళ్లంతా చిన్నారి చర్మానికి రక్షణ కోసం బేబీ ఆయిల్ ను వాడతారు. పిల్లల చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం పగలకుండా ఉంటుంది. నిజానికి బేబీ ఆయిల్ చిన్నపిల్లలకు మాత్రమే కాదు..పెద్దవాళ్లకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
పగలకుండా ఉండేందుకు వ్యాజిలిన్ వాడతారు. నిజానికి బేబీ ఆయిల్ కూడా వ్యాజిలిన్ గా చక్కగా పనిచేస్తుంది. ఇంట్లో సమయానికి వ్యాజిలిన్ లేకపోతే బేబీ ఆయిల్ ను వాడొచ్చు. ఒక్కోసారి పాదాలు పగిలి, స్కిన్ పెలుసుగా మారుతుంది. అలాంటప్పుడు క్రాక్ క్రీమ్ కొనాల్సిన అవసరం లేకుండా బేబీ ఆయిల్ ను రాస్తే సరిపోతుంది.
అంతేకాదు..మేకప్ కోసం ఎంత ఖర్చు చేస్తారో, దానిని తొలగించేందుకు మేకప్ రిమూవర్ కోసం కూడా ఖర్చు పెడుతుంటారు. ఇంట్లో బేబీ ఆయిల్ ఉంటే మేకప్ రిమూవర్ కొనాల్సిన పనేలేదు. డ్రై స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు బేబీ ఆయిల్ అప్లై చేస్తే దురద దూరమై.. స్కిన్ సాఫ్ట్ గా తయారవుతుంది. ముఖంపై ఏర్పడే టాన్, కంటి కింద నల్లని చారలను కూడా బేబీ ఆయిల్ తొలగిస్తుంది. స్కిన్ అలర్జీలకు బేబీ ఆయిల్ మంచి సొల్యూషన్.