మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్‌‌‌‌‌‌‌‌కు  37,215 అప్లికేషన్లు..

మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్‌‌‌‌‌‌‌‌కు  37,215 అప్లికేషన్లు..
  • గతేడాది కంటే తగ్గిన 3వేల దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే అడ్మిషన్ టెస్టుకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది మొత్తం 37,215 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఈసారి అప్లికేషన్ల సంఖ్య తగ్గింది. గతేడాది 40,332 అప్లికేషన్లు రాగా, ఈసారి ఆ సంఖ్య సుమారు 3 వేల వరకు తగ్గింది. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్19న ఉంటుందని ఆయన వెల్లడించారు.

మొత్తం దరఖాస్తులు తగ్గినప్పటికీ, ఆరో తరగతికి మాత్రం పోటీ పెరిగింది. గతేడాది 6వ తరగతికి 23,945 దరఖాస్తులు రాగా, ఈసారి స్వల్పంగా పెరిగి 23,957కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో ఆరో తరగతికి 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 7 నుంచి 10వ తరగతి వరకు కేవలం ఖాళీగా ఉన్న సీట్లను మాత్రమే ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. అందుకే ఈ తరగతులకు అప్లికేషన్లు తక్కువగా వచ్చాయి. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా 38,311 మంది విద్యార్థులు పరీక్ష ఫీజుచెల్లించినా, మరో 1,096 మంది విద్యార్థులు అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేయలేదు.