ఇరాన్ పూర్తిగా ఓడిపోయింది: ట్రంప్

ఇరాన్ పూర్తిగా ఓడిపోయింది: ట్రంప్

ఇరాన్ పూర్తిగా ఓడిపోయింది! అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ధాటికి తలవంచిన ఆ దేశం.. ఇప్పుడు ఒక ఒప్పందం కోసం నా చుట్టూ తిరుగుతోంది. కానీ స్పష్టంగా చెబుతున్నాను, ఆ దేశం ఇచ్చే ఏ ప్రపోజల్‌‌‌‌ ను నేను అంగీకరించను! ఖర్గ్ ఐలాండ్‌‌‌‌లో మేము చేసినవి పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన దాడులు. ప్రస్తుతం చమురు నిల్వలను వదిలిపెట్టాం.. కానీ ఇరాన్ గనుక హార్మూజ్ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే వాటిని కూడా పేల్చివేస్తాం. ఇరాన్ సైనిక సామర్థ్యం 100 శాతం తుడిచిపెట్టుకుపోయింది. ఈ కీలక సముద్ర మార్గం గుండా వాణిజ్యం సాఫీగా సాగాలంటే.. చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు వెంటనే తమ యుద్ధనౌకల ను ఇక్కడికి పంపాలి. అమెరికాతో చేతులు కలిపి ఈ ప్రాంతాన్ని సురక్షితం చేయాలి. ఇరాన్ ఆటలు ఇక సాగవు, అమెరికా గెలుపు ఖాయం.

- అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్​ ట్రంప్