వయనాడ్ను వదులుకున్న రాహుల్..ఉపఎన్నిక బరిలో ప్రియాంక

వయనాడ్ను వదులుకున్న రాహుల్..ఉపఎన్నిక  బరిలో  ప్రియాంక

రాహుల్ గాంధీ  కీలక నిర్ణయం తీసుకున్నారు. కేరళలోని వయోనాడ్ లోక్ సభ స్థానం వదులుకుంటున్నట్లు చెప్పారు.  ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థి రాజాపై  3,64,422 ఓట్ల తేడాతో రాహుల్ గెలిచారు.

ఇవాళ ఖర్గే నివాసంలో  సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అనంతరం మాట్లాడిన రాహుల్ వయనాడ్ లోక్ సభ స్థానాన్ని వదులుకుంటున్నట్లు చెప్పారు. వయనాడ్  ఉప ఎన్నిక బరిలో  తన సోదరి ప్రియాంక పోటీ చేస్తున్నట్లు చెప్పారు. నాకు వయనాడ్, రాయ్‌బరేలీతో భావోద్వేగ అనుబంధం ఉంది. రెండు ప్రాంతాల ప్రజలు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేను గత 5 సంవత్సరాలుగా వయనాడ్ నుండి ఎంపీగా ఉన్నాను. వయనాడ్  ప్రజల ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు. ప్రియాంక గాంధీ వాద్రా వాయనాడ్ నుండి ఎన్నికల నుండి పోటీ చేస్తారు. రాయ్ బరేలీతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తా. వయనాడ్ ప్రజలకు అందుబాటులో ఉంటా. అని రాహుల్ అన్నారు.

వాయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినందుకు  చాలా సంతోషంగా ఉన్నానని ప్రియాంకా గాంధీ అన్నారు. వయనాడ్ లో కష్టపడి పని చేస్తాను.  నేను రాయ్‌బరేలీ, అమేథీతో చాలా  సంబంధాన్ని కలిగి ఉన్నాను.  రాయ్‌బరేలి,  వాయనాడ్‌లో ఉన్న నా సోదరుడికి కూడా  అండగా ఉంటా అని ప్రియాంక అన్నారు.