ఢిల్లీ: భారత్ లో ఆడల్ట్ కంటెంట్, అసభ్యకరమైన వీడియోలు, చిత్రాలను పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్లు ఎక్స్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలను అనుసరించి ఎక్స్ భారత్లో పోర్న్, లైంగిక కంటెంట్ను బ్లాక్ చేసింది.బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన ఈ ప్లాట్ ఫామ్, భారత ఐటీ చట్టం ప్రకారం అశ్లీల కంటెంట్ ప్రచారం నిషేధమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో భారత్లో ఉన్న వి నియోగదారులు ఇకపై సమ్మతితో రూపొందించిన అడల్ట్ కంటెంట్ను చూడలేరు. ఇతర దేశాల్లో మాత్రం అదే కంటెంట్ అందుబాటులో ఉంటుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ లో పోర్న్ అధికమై యువత జీవితాలు దెబ్బతింటున్నాయని, ఇప్పటికై నా కట్టడి చేయడం మంచిదేనని వారు వ్యాఖ్యానించారు. అలస్యమైనా సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలపై సెన్సార్షిప్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అశ్లీలతను ప్రేరేపించేకంటెంట్, చట్టవిరుద్ధమైన వీడియోల విషయంలో ప్లా ట్ఫారము బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఇటువంటి కంటెంట్ను తొలగించని పక్షంలో ఆ సంస్థలపై చట్టప రమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, వాటి 'సేఫ్ హార్బర్'ను కూడా తొలగించే అవకాశం ఉంది. దీంతో ఎక్స్ తన అల్గారిథమ్ ను అప్డేట్ చేసింది..
►ALSO READ | 600 మంది ఉద్యోగుల ముఖాలతో.. బెల్సూట్ కుట్టించుకున్న ముంబై ఎండీ..నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు
