- ప్రపంచంలోనే టాప్ పొలిటికల్ లీడర్ గా ప్రధాని
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ప్రధాని మోదీ హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు చేరి హిస్టరీ క్రియేట్ చేయగా.. తాజాగా యూట్యూబ్లో కీలక మైలురాయిని దాటేశారు. ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో మోదీ ఛానల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య 30 మిలియన్లు (3 కోట్లు)కు చేరింది.
దీంతో ఈ వేదికపై ప్రపంచంలోనే అత్య ధిక సబ్స్కైబర్లు ఉన్న రాజకీయ నేతగా మోదీ రికార్డు సృష్టించారు. రెండో స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బో ల్సోనారో ఉన్నారు.2007లో ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఇప్ప టివరకు ఆయన 33 వేలకు పైగా వీడియోల ను షేర్ చేశారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ప్రధాని మోదీకి ఉన్న సబ్స్కెబర్ల సంఖ్య ఏడు రెట్లు ఎక్కువ కావడం విశేషం.
►ALSO READ | 600 మంది ఉద్యోగుల ముఖాలతో.. బెల్సూట్ కుట్టించుకున్న ముంబై ఎండీ..నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు
