
మాల్స్ మొదలు రైల్వే స్టేషన్ల వరకు ఇప్పుడు ఎస్కలేటర్లు సర్వసాధారణం. ఒకప్పుడు ఇది యూజ్ చేసేందుకు చాలా మంది భయపడేవారు. కానీ, ఇప్పుడు అది అందరికీ సర్వసాధారణమైపోయింది. తద్వారా మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు. అలసట ఉండదు. కేవలం ఒక అడుగు, ఈ ఎస్కలేటర్ మిమ్మల్ని ఎగువ లేదా దిగువ అంతస్తుకు తీసుకువెళుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రజలకు రోజువారీ ప్రయాణంలో ఎస్కలేటర్లు ప్రధాన భాగంగా మారాయి. దీంతో అంతస్తులు ఎక్కడానికి కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. కాని ఎస్కలేటర్లపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్టెప్స్ మధ్యలో నిలబడాలి. అంతే కాని ఆ చివరో..ఈ చివరో నిలబడితే ప్రమాదాలు జరుగుతాయి. కాళ్లు ఎస్కలేటర్ మెట్ల మధ్య ఇరుక్కున్నాయా ఇక అంతే చాలా ఇబ్బంది పడాల్సిందే. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే....
ప్రజలు ఎస్కలేటర్‌పై పడినప్పుడు వేళ్లు చిక్కుకుపోతున్నాయి . పిల్లలు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా వారి వేళ్లు.. పాదాలను గ్యాప్ వద్ద... సమీపంలో ఉంచినప్పుడు వేళ్లు లేదా పాదాలు చిక్కుకుపోతాయి. అప్పుడు పాదాలు ఆ గ్యాప్‌లోకి లాగబడతాయి. సాధారణంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఒక అంతస్థు నుంచి మరో అంతస్థులోకి వెళ్లేందుకు ఎస్కలేటర్లు పెడుతున్నారు. వాటి వలన ఎంత ఉపయోగం ఎంత ఉందో నష్టం కూడా అంత ఉందని ఈ వీడియో చూస్తే అర్దమవుతుంది.
ఎస్కలేటర్ల వలన సులభంగా మన లగేజీని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు, కాని ఎస్కలేటర్లపై అజాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ కాలు ఎస్కలేటర్ మధ్యలో ఇరుక్కుపోయింది. అయినా ఆగకుండా వెళుతూనే ఉంది. అప్పుడు కాలు తీసుకోవడానికి ప్రయత్నించగా రాకాపోగా.. నొప్పితో గట్టిగా అరిచింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి ఏం జరిగిందో అర్దం కాలేదు. కాని కొంతమంది ఎస్కలేటర్ ను ఆపడానికి ప్రయత్నించారు. కాని ఆగకపోవడంతో ఆ అమ్మాయి పాదం ఇరుక్కుపోయింది.
ఆ అమ్మాయి అరుపులు విని ఆ మాల్ కార్మికులు ఒక ఇనుపరాడ్ సహాయంతో ఎస్కలేటర్ ను ఆపారు. అప్పుడు ఆ అమ్మాయి కాలు బయటకు తీసింది. కాని తీవ్రంగా గాయపడింది. అయితే కాలు తీసుకునేటప్పుడు షూ మాత్రం రాలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఇప్పటి వరకు (వార్త రాసే సమయం ) 21 లక్షల మంది వీక్షించగా.. కొన్ని వేలమంది లైక్ చేసి .. షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. చాలా మంది ఆ అమ్మాయి తల్లిదండ్రులను తప్పుపట్టారు. ఎస్కలేటర్ పై ఉన్నప్పుడు ఆ బాలిక చేయి పట్టుకుని ఉంటే.. ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని కామెంట్ చేశారు. మరొకరు ఎస్కలేటర్ పై కాలు మాత్రమే ఇరుక్కు పోయింది. అదే పొడవాటి జుట్టు ఇరుక్కుపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి.. అంటే పోస్ట్ చేశారు.
ఏది ఏమైనా.. షాపింగ్ మాల్సలో కాని.. రైల్వేస్టేషన్.. బస్ స్టేషనే కాదు... ఎక్కడైనా సరే ఎస్కలేటర్ ఎక్కినప్పుడు, పిల్లలను.. వృద్దులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్కలేటర్ చివరికి వచ్చినప్పుడు దిగేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎస్కలేటర్ నుంచి తొందరగా దిగలేని వారున్నప్పుడు మెట్లు వాడటమే మంచిది. ఇలాంటి టెక్నాలజీ వల్ల.. ఉపయోగాలతో పాటు.... అనర్దాలు కూడా ఉంటాయి. కావున ఎస్కలేటర్ పై వెళ్లేటప్పుడు.. తస్మాత్ జాగ్రత్త ఫ్రెండ్స్. . . .