కోవిడ్ నాలుగో వేవ్ ను తట్టుకోవడం చాలా కష్టం

కోవిడ్ నాలుగో వేవ్ ను తట్టుకోవడం చాలా కష్టం

న్యూఢిల్లీ: నాలుగో కరోనా వేవ్ ను తట్టుకోవడం చాలా కష్టమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ తదితర అంశాల గురించి ఆయన మాట్లాడారు. తమ దగ్గర వ్యాక్సిన్ నిల్వలు తక్కువగా ఉన్నాయని, 10 రోజులకే అవి సరిపోతాయని తెలిపారు. వ్యాక్సినేషన్ విషయంలో వయసు నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పుడు ఢిల్లీలో నడుస్తోంది కోవిడ్ నాలుగో వేవ్ అని, ఇది అతి ప్రమాదకరమైంది అన్నారు. మహమ్మారిని అదుపు చేయడానికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, పలు కొత్త నిబంధనలు కూడా విధించనున్నట్లు చెప్పారు.