జీడిమెట్లలో ఉచిత బయో టాయిలెట్స్

జీడిమెట్లలో ఉచిత బయో టాయిలెట్స్

జీడిమెట్ల, వెలుగు:  జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఉచిత బయో టాయిలెట్స్​అందుబాటులోకొచ్చాయి. ప్రయోగాత్మకంగా ఫేజ్​-5 లో ఏర్పాటు చేసిన ఉచిత బయో టాయిలెట్లను టీఎస్ఐఐసీ జోనల్​ మేనేజర్ మాధవి, జేఎన్ఎంఐఏ సర్వీస్ ​సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ విధానం సక్సెస్​ అయితే  అన్ని ఫేజ్​లలో మరో 20 వరకూ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడైన జీడిమెట్లలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు. అలాగే ఇతర రాష్టాల నుంచి అనేక మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు.  గతంలో  వీరందరికి టాయిలెట్స్​ సౌకర్యం లేక బహిరంగంగానే మూత్ర విసర్జన చేసేవారు. దీంతో అధికారులు స్వచ్ఛ హైదరాబాద్​లో భాగంగా  మూడు చోట్ల  ఉచిత టాయిలెట్స్​ను  కట్టించారు.  వీటితో ఆశించిన ఫలితాలు దక్కాయి.  అధికారులు మరో అడుగు ముందుకు వేసి  బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు.​