డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌తో ఎన్‌‌పీఎస్‌‌ అకౌంట్‌‌

డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌తో ఎన్‌‌పీఎస్‌‌ అకౌంట్‌‌

న్యూఢిల్లీ : ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుకొని నేషనల్ పెన్షన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌(ఎన్‌‌‌‌పీఎస్‌‌‌‌) అకౌంట్‌‌‌‌ను ఓపెన్ చేసుకోవచ్చు.  పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీఏ) రూల్స్‌‌‌‌ను సవరించడంతో డిజీలాకర్ ద్వారా ఎన్‌‌‌‌పీఎస్‌‌‌‌ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలుంటుంది. ఈ కొత్త ఫెసిలిటీతో యూజర్లు తమ ఎన్‌‌‌‌పీఎస్ అకౌంట్‌‌‌‌లోని అడ్రస్‌‌‌‌ను కూడా అప్‌‌‌‌డేట్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా  ఎన్‌‌‌‌పీఎస్ అకౌంట్‌‌‌‌ను ఓపెన్ చేయడానికి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో రిజిస్ట్రేషన్‌‌‌‌లోకి వెళ్లి ‘రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ విత్‌‌‌‌’  కింద ‘డాక్యుమెంట్ విత్ డిజీలాకర్‌‌‌‌‌‌‌‌’ ను  సెలెక్ట్ చేసుకోవాలి.

‘సెలెక్ట్ డాక్యుమెంట్‌‌‌‌’లో డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత యూజర్లు డిజీలాకర్ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లోకి రీడైరెక్ట్ అవుతారు. ఈ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో తమ లాగిన్ డిటెయిల్స్‌‌‌‌ను సబ్మిట్ చేయాలి. మీ పేపర్లను షేరు చేసుకోవడానికి సీఆర్‌‌‌‌‌‌‌‌కేఏఎస్‌‌‌‌కు పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత డిజీలాకర్‌‌‌‌‌‌‌‌ను యాక్సెస్ చేయడానికి ఎన్‌‌‌‌పీఎస్‌‌‌‌కు అవకాశం ఇవ్వాలి. అప్లికేషన్ ఫామ్‌‌‌‌ను నింపాక మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది.