Gaddar : అసలు పేరు విఠల్ రావు.. గద్దర్ గా ఎలా మారిందంటే.?

Gaddar : అసలు పేరు విఠల్ రావు.. గద్దర్ గా ఎలా మారిందంటే.?

తన  ఆటపాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పోరాట యోధుడు ప్రజాగాయకుడు గద్దర్(Gaddar) తుది శ్వాస విడిచారు. ఇవాళ (ఆగస్టు 6)న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ కన్నుమూశారు. 

విఠల్ రావు గద్దర్ గా ఎలా మారారంటే?

గద్దర్(Gaddar) 1949లో మెదక్ జిల్లాలోని తుప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు జన్మించారు. ప్రపంచానికి గద్దర్(Gaddar) గా సుపరిచితుడైన ఆయన అసలు పేరు  విఠల్ రావు.  అయితే గద్దర్  విప్లవ భావం వైపు నడుస్తున్నప్పుడు ఆయన రాసిన పాటలు  జననాఠ్య మండలిలో ప్రింట్ అయ్యేవి. అందులో ఎవరు ఎన్ని పాటలు రాసినా  కవుల పేర్లు ప్రింటే చేసే వారు కాదు. విప్లవ పాటలు రాసిన వారి పేర్లు  ప్రింట్ చేస్తే పోలీసులు, ప్రభుత్వం ఊరుకునే వారు కాదు. తాను రాసిన పాఠలకు విప్లవ స్ఫూర్తి ఉండాలని  భావించిన ఆయన  గదర్ అని పేరు పెట్టుకున్నారు.  పంజాబ్ లో గదర్ (GADAR అంటే విప్లవం). ఈ పేరు భగత్ సింగ్ ల  వారసత్వం. అయితే పొరపాటున బుక్ లలో ప్రింట్ అయ్యేటప్పుడు  గద్దర్(Gaddar) గా మారింది. అప్పటి నుంచి గద్దర్  అని పిలుస్తున్నారు. ఇదే విషయాన్ని గద్దర్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.