Gaddar :చనిపోయే వరకు.. గద్దర్ శరీరంలో తుపాకీ బుల్లెట్​

Gaddar :చనిపోయే వరకు.. గద్దర్ శరీరంలో తుపాకీ బుల్లెట్​

ఒక బుల్లెట్టు తగిలితే.. స్పాట్​లో చనిపోతారు. అలాంటిది ఓ బుల్లెట్ ని జీవితాంతం తన శరీరంతో పాటు మోస్తే. గద్దర్ (Gaddar)​ జీవితంలో ఆ విషాద ఘటన తాలూకు వివరాలు తెలుసుకుందాం.  ఆయన ఇప్పటి వరకు ఒక తుపాకీ బుల్లెట్టును మోస్తూ ఉన్నారనే విషయం మీకు తెలుసా.  

బూటకపు ఎన్​కౌంటర్​లు చేస్తున్నారని ఆరోపిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం.. సీఎం చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా ఆయన 1997 ఏప్రిల్​6న హైదరాబాద్​లో నిరసన తెలిపారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున జనసమీకరణ కావడంతో పోలీసులు నిరసనల్ని అణచివేయడానికి ప్రయత్నించారు. 

ఈ క్రమంలో పోలీసులు గద్దర్​పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆయన్ని ఆసుపత్రికి తరలించి ట్రీట్​మెంట్​ ప్రారంభించారు. శరీరంలో అన్ని బుల్లెట్లు తొలగించినప్పటికీ ఒక బుల్లెట్​ తీయడానికి డాక్టర్లు వెనకడుగేశారు. 

కారణం ఆ బుల్లెటు తీస్తే గద్దర్​ప్రాణానికే ప్రమాదం. దీంతో దాన్ని ఆయన ఒంట్లో అలాగే వదిలేశారు. ఆయన జీవిత చరమాంకం వరకు బుల్లెట్టుని తన శరీరంలో ఉంచుకున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 6న తుది శ్వాస విడిచారు.