Gaddar : గద్దర్ చనిపోవటానికి.. 12 గంటల ముందు ఏం జరిగింది..?

Gaddar : గద్దర్ చనిపోవటానికి.. 12 గంటల ముందు ఏం జరిగింది..?

గద్దర్ (Gaddar ).. ఈ మాట వింటే గుర్తొచ్చేది ఆయన పాటలు.. ఆయన పాటలే ఆయన్ను గుర్తు చేస్తాయి. ఉద్యమం అంటే చాలు గద్దర పాట ఉండాల్సిందే.. అంతలా ప్రజా జీవితంలో మమేకం అయ్యారు గద్దర్. కొన్నాళ్లు క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయనకు రెండు రోజుల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. అంతా బాగానే ఉందని డాక్టర్లు, కుటుంబ సభ్యులు ప్రకటించారు. అలాంటి గద్దర్ హఠాత్తుగా చనిపోయారనే వార్త.. అందర్నీ షాక్ కు గురి చేసింది. అసలు గద్దర్ చనిపోవటానికి కారణాలు ఏంటో డాక్టర్ మాటల్లో ఇలా ఉంది..

గుండె ఆపరేషన్ తర్వాత గద్దర్ కోలుకుంటున్నారు. అయితే ఆగస్ట్ 6వ తేదీ ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఒక్కసారిగా బీపీ.. బ్లడ్ ప్రెజర్ పెరిగింది. బీపీని కంట్రోల్ చేసే సమయంలోనే.. అతని అప్పటికే ఉన్న షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గిపోయాయి. ఓ వైపు బీపీ పెరగటం.. మరో వైపు షుగర్ లెవల్స్ తగ్గటంతో చికిత్సకు స్పందించటం కష్టంగా మారింది అతని శరీరం. 

ఇదే సమయంలో.. అతని శరీరంలోని అవయవాలు చికిత్సకు స్పందించటం మానేశాయి. కిడ్నీ, లివర్ పని చేయటం మందగించింది. ఇలా క్రమంగా 12 గంటల్లోనే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి.. ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు గద్దర్. 

గుండె ఆపరేషన్ తర్వాత కోలుకుని ఇంటికి వస్తారనుకున్న అభిమానులు.. ఇప్పుడు గద్దర్ లేరని తెలిసి బాధపడుతున్నారు. అతని జ్ణాపకాలను నెమరు వేసుకుంటున్నారు.