అంగన్‌‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచాలి : యూనియన్ అధ్యక్షురాలు కె. సునీత

అంగన్‌‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచాలి : యూనియన్ అధ్యక్షురాలు కె. సునీత
  • యూనియన్ నాయకుల డిమాండ్

హైదరాబాద్, ముషీరాబాద్ వెలుగు: అంగన్‌‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచి, వారి సమస్యలు పరిష్కరించాలని యూనియన్ అధ్యక్షురాలు కె. సునీత, ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ ​చేశారు. తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) తలపెట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. అనుమతి లేకుండా ధర్నా చేయడానికి ఇందిరాపార్క్ వద్దకు వచ్చిన అంగన్​వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్​చేశారు. 

దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ.. అంగన్‌‌వాడీ టీచర్స్, హెల్పర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, ఐసీడీఎస్​కు సరిపడా నిధులు కేటాయించాలన్నారు. ఎన్ఐపీ-–2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ ​చేశారు. 

ధర్నాను అడ్డుకోవడం దారుణం:జాన్ వెస్లీ

అంగన్‌‌‌‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ధర్నాను పోలీసులు అడ్డుకోవడం దారుణమని సీపీఎం నేత జాన్ వెస్లీ అన్నారు. అంగన్​వాడీ కార్యకర్తల అరెస్ట్​లను ఆయన ఖండించారు.