గణేష్ నవరాత్రి ఉత్సవాలు..పోస్టర్లు, బ్యానర్ల కట్టడంపై నిషేధం

గణేష్ నవరాత్రి ఉత్సవాలు..పోస్టర్లు, బ్యానర్ల కట్టడంపై నిషేధం

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారికి కార్పొరేషన్ అధికారులు కీలక సూచనలు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగే రోజులు పోస్టర్లు, బ్యానర్ల కట్టడంపై నిషేధం విధించారు. అలాగే  పెద్ద సౌండ్లు పెట్టిన జనాలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇది మన హైదరాబాద్ లో కాదు..ముంబైలో...బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు ఈ మేరకు ప్రకటన చేశారు. 

ముంబైలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అక్కడి గల్లీ గల్లీకి ఓ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు..పలు ఆంక్షలు విధించారు. ఇష్టానుసారంగా బ్యానర్లు, పోస్టర్లు వేయొద్దని సూచించారు. రోడ్లపై ఎక్కడపడిడతే అక్కడ బ్యానర్లు కట్టొద్దన్నారు. అడ్డగోలుగా బ్యానర్లు, పోస్టర్లు కట్టేవారికి ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నారు. సెప్టెంబర్1వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 10 వేలకు పైగా అక్రమంగా అతికించిన పోస్టర్లు, బ్యానర్లు, రాజకీయ పార్టీల జెండాలను తీసేశారు. 

మరోవైపు  ముంబైలో అక్రమంగా బ్యానర్లు, పోస్టర్ల నేపథ్యంలో బృహన్ ముంబై కార్పొరేషన్ వార్డుకో అధికారిని నియమించింది. వార్డుల అధికారుల జాబితా http://portal.mcgm.gov.in వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఈ అధికారి 24 గంటల పాటు అందుబాటులో ఉంటాడని పేర్కొంది. తమ కాలనీలు, బస్తీల్లో అడ్డగోలుగా బ్యానర్లు, పోస్టర్లు వెలిస్తే టోల్ ఫ్రీ నంబర్:1800223467, MTNL ల్యాండ్‌లైన్/మొబైల్ : 1292/1293 కు కాల్ చేయాలని సూచించింది.