
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( జూన్8 నుంచి 14 వ తేది వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం.
మేషరాశి: ఈ వారం ఈ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. చేతి వృత్తుల వారికి అనుకోకుండా ఆర్డర్లు పెరుగుతాయి. సమాజంలో గౌరవం ... కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృషభ రాశి: ఈ రాశి వారు అనుకోకుండా ధనలాభం పొందుతారు. మీరు తీసుకునే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో అప్పులు నుంచి విముక్తి కలుగుతుంది.ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
మిథునరాశి: ఈ రాశి ఈ వారం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఓర్పు ... సహనంతో ఉండండి.. ఎలాంటి వాదోపవాదనలకు పెట్టుకోవద్దు. ఆఫీసులో మీ పని మీరు చేసుకోండి.. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు..దైవ చింతనతో గడపండి.. ఎలాంటి ఒడిదుడుకులకు.. ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారుఈ వారం ఖరీదైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా అంతా బాగుంటుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
సింహ రాశి: ఈ రాశి వారికి ఈ వారం చివరిలో గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. మీరు అనుకున్న ప్రాజెక్ట్ మొదలు పెట్టి విజయం సాధిస్తారు. ప్రతి విషయంలోనూ సీక్రసీ మెయింటైన్ చేయండి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు లభిస్తాయి. వ్యాపారస్తులకు అనుకోకుండా లాభాలు కలుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ప్రేమ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి.ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కన్యారాశి: ఈ రాశి వారు ఈ వారంలో కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో నిర్ణయం తీసుకొనేటప్పుడు కుటుంబసభ్యులను సంప్రదించండి. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని పనిభారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీ క్యూరియాసిటీ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
తులా రాశి : ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కేరీర్ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. డబ్బును ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ... పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి.
వృశ్చికరాశి : ఈ రాశి వారికి ఈ వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. చేతివృత్తుల వారికి మంచి పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ వారంలో ఆదాయం ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతా మంచే జరుగుతుంది.
ధనుస్సు రాశి: ఈ వారం ఈ రాశి వారికి అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండండి. ఆఫీసులో ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. మీపని మీరు చేసుకోండి. మీ ప్రమేయం లేకుండా... మీకు సంబంధం లేకపోయినా.. ఒక్కోసారి అవమానాలు పడాల్సి వస్తుంది. ఓర్పు.. సహనం పాటించండి.. తరువాత వాళ్లే రియలైజ్ అవుతారు. ఇక వ్యాపారస్తుల విషయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
మకరరాశి: ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అందరూ సహకరిస్తారు. మీకు ఇష్టమైన వారిని కలిసే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా.. సంతృప్తికరంగానే ఉంటుంది. ఆఫీసులో మీరే కీలక పాత్ర పోషిస్తారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.ఆర్ధిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది.. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.
కుంభరాశి: ఈ రాశి ఈ వారు కొత్తగా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పని ఒత్తిడిలో కుటుంబానికి తగిన సమయం కేటాయించలేకపోతారు. కొత్త వారు పరిచయం అవుతారు. సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెడితే అనుకోని లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.
మీనరాశి: ఈ వారం ఈ రాశి వారు డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లండి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినా..ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు.