లంచాలకు రుచిమరిగిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు..రాను రాను..మరి నీచానికి దిగజారుతున్నారు. ఏ విషయంలో అవినీతికి పాల్పడాలో....ఏ విషయంలో అక్రమ సొమ్మును జేబులో వేసుకోవాలో అని కూడా ఆలోచించకుండా..అందిన కాడికి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ అత్యంత నీచంగా అవినీతికి పాల్పడ్డాడు.
ఎంతకు దిగజారాడు..
డాక్టర్ కార్తీక్..ఇతని గురించి చెబితే సిగ్గుపోతుంది..చెప్పకుండా ఉంటే ఇతగాడు చేసిన అవినీతి చీకట్లోనే ఉండిపోతుంది. అయితే డాక్టర్ కార్తీక్..,చందానగర్ ను మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. అవినీతి రుచిమరిగిన డాక్టర్ కార్తీక్..చాలా కొత్తగా..కాదు కాదు..చెత్తగా..పబ్లిక్ టాయిలెట్ మెయింటెన్స్ పేరుతో అవినీతికి పాల్పడ్డాడు. చందానగర్ మున్సిపల్ కార్యాలయం పరిధిలోని 138 పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రంగా చేశామంటూ బిల్స్ పెట్టాడు. పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రత కోసం రూ. 8 లక్షలు వినియోగించామని బిల్లుల్లో పేర్కొన్నాడు.
ALSO READ: డబ్బు కొట్టు.. సీటు పట్టు : గ్లోబల్ లీడర్ కె.ఏ.పాల్.. గూగుల్ పే అప్లికేషన్స్
దొరికాడు దొంగ ఇలా..
డాక్టర్ కార్తీక్ పెట్టిన బిల్లుపై మున్సిపల్ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 138 టాయిలెట్లలో కనీసం సగం కూడా పరిశుభ్రంగా లేవని తేల్చారు. విధుల పట్ల నిర్లక్ష్యంతో పాటు అవినీతికి పాల్పడుతున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో డాక్టర్ కార్తీక్ కు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

