గోదావరి బోటు మృతుల కుటుంబాలకు ఇల్లు, ఉద్యోగం

గోదావరి బోటు మృతుల కుటుంబాలకు ఇల్లు, ఉద్యోగం

ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటన

పాపికొండల్లో గోదావరి బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ 90 లక్షల పరిహారం చెక్కులను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేసింది. వైజాగ్ సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.90 లక్షలు చెక్కులను ఏపీ పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందజేశారు.

బాధిత కుటుంబాలకు ఇల్లు సౌకర్యం కల్పిస్తామని.. ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు మంత్రి శ్రీనివాసరావు. మృతులు అందరికీ బీమా మొత్తం త్వరలోనే వచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. బోటు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన 17 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని చెప్పారు. వారిలో తొమ్మిది మందికి మృతునికి రూ 10 లక్షలు చొప్పున వారి కుటుంబ సభ్యులకు చెల్లిస్తున్నట్లు తెలియజేశారు.

ఈ ప్రమాదంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఐదుగురు IAS అధికారులతో ఒక కమిటీని వేసినట్లు చెప్పారు.