ఖమ్మంలో రూ.45 లక్షల బంగారం బ్యాగు చోరీ

ఖమ్మంలో రూ.45 లక్షల బంగారం బ్యాగు చోరీ

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలోని త్రీ టౌన్  పోలీస్ స్టేషన్  పరిధిలోని గాంధీచౌక్ లో బంగారం వ్యాపారి నుంచి బ్యాగ్ ను ఎత్తుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి.. బుధవారం రాత్రి గాంధీ చౌక్ లోని రియాన్స్  బంగారం షాపు యజమాని వంకాయలపాటి కార్తీక్  తన షాప్  మూసి వేసి ఇంటికి వెళ్తుండగా, రాత్రి పదిన్నర గంటల సమయంలో టిఫిన్  చేసేందుకు ఒక తోపుడు బండి దగ్గర ఆగాడు.

 ఆ సమయంలో స్కూటీలో పెట్టిన బ్యాగ్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. నిందితుడు రెక్కీ నిర్వహించి చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి గురైన బ్యాగ్ లో 5 కిలోల వెండి, 250 గ్రాముల బంగారం కడ్డీ ఉన్నట్లు కార్తీక్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన బంగారం, వెండి విలువ సుమారు రూ.45 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.