ఫైనల్‌‌ జరగకపోతే ఇద్దరికీ గోల్డ్‌‌ మెడల్‌‌

ఫైనల్‌‌ జరగకపోతే ఇద్దరికీ గోల్డ్‌‌ మెడల్‌‌

టోక్యో: ఒలింపిక్స్‌‌లో పాల్గొంటున్న హాకీ జట్లకు కొత్త రూల్స్‌‌ను ప్రకటించారు. ఒకవేళ కరోనా పాజిటివ్‌‌ కేసుల వల్ల ఫైనల్‌‌ మ్యాచ్‌‌ జరగకపోతే.. రెండు జట్లకు గోల్డ్‌‌ మెడల్‌‌ ఇస్తామని ఇంటర్నేషనల్‌‌ హాకీ ఫెడరేషన్‌‌ (ఎఫ్‌‌ఐహెచ్‌‌) శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఆటకు సంబంధించిన స్పోర్ట్‌‌ స్పెసిఫిక్‌‌ రెగ్యులేషన్స్‌‌ (ఎస్‌‌ఎస్‌‌ఆర్‌‌)ను ఎఫ్‌‌ఐహెచ్‌‌ చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ ఆఫీసర్‌‌ థియరీ వీల్‌‌ రిలీజ్‌‌ చేశాడు. పూల్‌‌ గేమ్‌‌లో ఏ జట్టు అయినా మ్యాచ్‌‌ ఆడకపోయినా.. ప్రత్యర్థులు 5–0తో గెలిచినట్లు ప్రకటిస్తారు. ఒకవేళ రెండు జట్లు మ్యాచ్‌‌కు అందుబాటులో లేకపోతే గోల్‌‌ లెస్‌‌ డ్రాగా రిజల్ట్‌‌ ఇస్తారు. మిగతా పూల్‌‌ మ్యాచ్‌‌లు యధావిధిగా ఆడుకోవచ్చు. టోక్యో ఒలింపిక్స్‌‌.. సాధారణంగా గేమ్స్‌‌కు భిన్నంగా జరుగుతున్నాయని వీల్‌‌ అన్నాడు. జట్టులో ఆరు, ఏడు పాజిటివ్స్‌‌ వచ్చినా.. వాళ్లను వదిలేసి మిగతా వాళ్లతో మ్యాచ్‌‌ ఆడే చాన్స్‌‌ ఇస్తామన్నాడు. టీమ్‌‌ మొత్తానికి వైరస్‌‌ సోకినప్పుడే తప్పుకోవచ్చన్నాడు.