హైదరాబాద్: నిజాం కాలేజ్ బయో టెక్నాలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో… బయె టెక్నాలజీ జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ హాజరయ్యారు. వీరితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ తాత్కాలిక వీసి అరవింద్ కుమార్, పలువురు ప్రొఫెసర్లు, ప్రముఖులు పాల్గొన్నారు. బయో టెక్నాలజీ ప్రస్తుత స్థితి గతులు, భవిష్యత్తు ఉపయోగాలు అనే అంశంపై రెండు రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా జాతీయ సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు గవర్నర్.
సభను ఉద్ధేశించి మాట్లాడిన గవర్నర్..
యంగ్ బయో టెక్నాలజీ స్టూడెంట్స్ కు ఇలాంటి జాతీయ సదస్సులు ఎంత గానో ఉపయోగపడుతాయన్నారు. మ్యారేజ్ అయ్యాక అమ్మాయిలు చదువును ఆప కుండా ఉండేలా భర్తలు సహకరించాలని కోరారు. తమిళ నాడు తంజావూరులో పోలియో ఎటాక్ ఆయితే అక్కడి స్టార్ రజినీకాంత్ తో ప్రత్యేక మైన అవేర్నెస్ కార్యక్రమాలు జరిగాయని… దాని ద్వారా ప్రజల్లో అవగాహన కలిగిందని చెప్పారు. ప్రతి వ్యాధి పట్ల అవేర్నెస్ కార్యక్రమాలు జరుగాలని గవర్నర్ కోరారు. హైదరాబద్ మెడికల్ సైన్స్, ఫార్మసీ , వ్యాక్సిన్ తయారీలో ప్రత్యేకమైన చరిత్ర కలిగి ఉందని మెచ్చుకున్నారు. ఈ రోజుల్లో వ్యాధుల కంటే ఎక్కవ మెడిసిన్ ధరలను చూసి ప్రజలు భయపడుతున్నారని అన్నారు గవర్నర్. ప్రధాని మోడీ జనరిక్ డ్రగ్స్ ను తక్కువ ధరలకు ప్రజలకు అందేలా మెడికల్ షాప్ లో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు.
