యస్ బ్యాంక్ మాజీ ఎండీకి బెయిల్

యస్ బ్యాంక్ మాజీ ఎండీకి బెయిల్

యస్ బ్యాంక్ ఫౌండర్ రాణా కపూర్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. 300 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు అయిన రాణా కపూర్‌కు ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  మనీలాండరింగ్ కేసులో యెస్ బ్యాంక్ మాజీ ఎండి మరియు సిఇఒ కపూర్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు అంతకుముందు రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి స్పందన కోరింది. జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ కూడా కపూర్ పిటిషన్‌పై నోటీసు జారీ చేశారు కేసును తదుపరి విచారణకు మార్చి 11కు వాయిదా వేశారు.

యెస్ బ్యాంక్ మాజీ ఎండీ బెయిల్ పిటీషన్‌ను జనవరిలో కోర్టు తిరస్కరించింది. అతనిపై ఆరోపణలు తీవ్రమైనవి అని కోర్టు పేర్కొంది. అయితే, మరో 15 మంది నిందితులు – బి హరిహరన్, అభిషేక్ ఎస్ పాండే, రాజేంద్ర కుమార్ మంగళ్, రఘుబీర్ కుమార్ శర్మ, అనిల్ భార్గవ, తాప్సీ మహాజన్, సురేంద్ర కుమార్ ఖండేల్వాల్, సోను చద్దా, హర్ష్ గుప్తా, రమేష్ శర్మ, పవన్ కుమార్ అగర్వాల్, అమిత్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అక్టోబరు 2021లో, కపూర్ మరియు ఇతరులపై విచారణకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా ఛార్జ్ షీట్‌కు సమానమైన ED ప్రాసిక్యూషన్ ఫిర్యాదును కోర్టు పరిగణలోకి తీసుకుంది.